మంగళవారం 02 మార్చి 2021
Warangal-city - Jan 14, 2021 , 00:31:19

సరదాల సంక్రాంతి

సరదాల సంక్రాంతి

  • పండుగకు ఊరూవాడా ముస్తాబు
  • ముచ్చటగొలిపే ముగ్గులు.. గొబ్బెమ్మలు
  • ప్రత్యేక ఆకర్షణగా డూడూ బసవన్నలు
  • సందడి చేయనున్న హరిదాసులు
  • అంతటా ఆధ్యాత్మిక వాతావరణం

నేడు సరదాల సంక్రాంతిని ఘనంగా జరుపుకొనేందుకు ఊరూవాడా ముస్తాబైంది. వేకువజామునే ఆడబిడ్డలు వాకిళ్లలో సింగిడులను ఆవిష్కరించి వాటి మధ్య ముచ్చటగొలిపే గొబ్బెమ్మలను ఉంచి ఇంటింటికీ పండుగ శోభను ఇనుమడింపజేయనున్నారు. డూడూ బసవన్నలు, హరిదాసుల సందడితో గ్రామాలు కళకళలాడనున్నాయి. 

- హన్మకొండ

ధనుర్మాసం ముగిసి, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజును మకర సంక్రాంతిగా పిలుస్తారు. భానుడు దక్షిణాయణం చాలించి, ఉత్తరాయణంలోకి అడుగుపెట్టే సం క్రాంతి పర్వదినాన్ని గురువారం ఘనంగా జరుపుకునేందుకు జిల్లావాసులు సిద్ధమయ్యారు. భోగిపండుగను బుధవారం వైభవంగా ము గించుకుని నేడు సంక్రాంతి, రేపు కనుము పండుగను కన్నులపండువగా నిర్వహించుకోనున్నారు. సం క్రాంతికి మహిళలు బొమ్మల కొలువులు పెడతారు. ఇంటింటా చిన్నారులు బొమ్మల కొలువులు ఏర్పా టు చేస్తారు. సౌభాగ్యవంతులైన మహిళలు సంక్రాంతి నోములు నోచుకుని ముత్తయిదువులను పిలి చి వాటిని కానుకగా అందజేసి ఆశీర్వాదం తీసుకుంటారు. పసుపు, కుంకుమలతో సౌభాగ్యాన్ని స్వీకరిస్తారు. బెల్లం, నువ్వులు ప్రసాదాలు గా పంచిపెడుతారు. కలకాలం ద్వే షాలు తొలగి సంతోషాలతో కలిసి ఉండాలని ఆకాంక్షిస్తూ నోములు, వ్రతాలు చేస్తారు. 

ఊరూరా ఆధ్యాత్మిక శోభ

పండుగ సందర్భంగా నగరంతో పాటు, పట్టణాలు, పల్లెలన్నీ ఆధ్యాత్మిక శోభతో ఉట్టి పడుతున్నాయి. భోగి పండుగ నుంచే వాకిళ్లు రంగవల్లులతో నిండిపోయాయి. ఇళ్లన్నీ పండివంటలతో ఘుమఘుమలాడుతున్నాయి. బంతిపూలు, మామిడాకులతో ఇంటి గుమ్మాలు అందం గా కనిపిస్తున్నాయి. భోగి మంటల వద్ద చిన్నాపెద్దా సందడి చేశారు. సాయంత్రం చిన్నారులకు భోగిపండ్ల పోసి సంబురపడ్డారు. పలుచోట్ల ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.

 హరిదాసుల సందడి

సంక్రాంతి వచ్చిందంటే గ్రామాలు హరిదాసులతో సందడిగా మారుతాయి. ‘హరిలో రంగ హరీ’ అంటూ ఉదయాన్నే దర్శనమిచ్చే హరిదాసులు పట్టణాల్లో కనుమరుగైనా పల్లెలో కొనసాగుతూనే ఉన్నది. తలపై  గుమ్మడి ఆకారపు గిన్నె, నుదుట తిరునామం, మెడలో పూలహారం, చేతిలో వీణ, కాళ్లకు గజ్జెలు, ఆ గజ్జెల ధ్వ నికి అనుగుణంగా నృత్యం, గానం చేస్తూ చేస్తూ హరిదా సులు ఆకట్టుకుంటారు. గుమ్మడి ఆకారపు గిన్నె భూమి కి సంకేతమని, దాన్ని హరిదాసు తల మీద ధరించి రా వడమంటే శ్రీహరే భూమిని రక్షిస్తూ ఉంటాడనేదానికి సంకేతమని భావిస్తారు. తెలవారగానే హరిదాసు రావ డం అంటే సాక్షాత్తూ శ్రీమహా విష్ణువే ఇంటికి వచ్చినట్లు నమ్ముతారు. హరిదాసు పాత్రలో బియ్యం వేయడమ నేది.. రాబోయే పంట కోసం ధాన్యాన్ని భూమిలో విత్త నాలుగా వేయడానికి సంకేతమని చెబుతుంటారు. శ్రీ హరి అనుగ్రహంతో భూమి మనకు పంటనిస్తే శ్రీహరి ప్రతినిధికి కృతజ్ఞతా భావంగా సమర్పించడమనేది ఇందులో అంతరార్థంగా కనిపిస్తుంది. 

VIDEOS

logo