ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Warangal-city - Jan 13, 2021 , 00:11:14

ధర్మసాగర్‌లో పది ఇండ్లల్లో చోరీ

ధర్మసాగర్‌లో పది ఇండ్లల్లో చోరీ

  • 11.50 తులాల బంగారం, 30 తులాల వెండి అపహరణ
  • రూ. 1.18 లక్షల నగదు దొంగతనం

ధర్మసాగర్‌, జనవరి 12: మండల కేంద్రంలోని వడ్డె ర కాలనీలోని పది ఇండ్లలో దొంగలు గుట్టుచప్పుడు కాకుండా చొరబడి చోరీకి పాల్పడిన ఘటన మంగళవారం వెలుగుచూసింది. స్థానిక సీఐ బొల్లం రమేశ్‌ కథనం ప్రకారం.. కాలనీలో సుమారు 50 కుటుంబా లు నివాసముంటున్నాయి. ఇందులో కొందరు ఇంటి కి తాళాలు వేసి జీవనోపాధి కోసం  హైదరాబాద్‌ వెళ్లా రు. సోమవారం రాత్రి తాళాలు వేసి ఉన్న 10 ఇండ్ల ల్లో దొంగలు చోరీకి పాల్పడారు. మంగళవారం పక్క ఇళ్లవారు చూసి పోలీసులకు సమాచారమందించారు. సంఘటనా స్థలానికి ధర్మసాగర్‌ సీఐ బొల్లం రమేశ్‌ చేరుకుని ఆరా తీశారు. జరిగిన ఘటనపై ఫింగర్‌ ప్రిం ట్‌, సైబర్‌ సీఐ రమేశ్‌, ఎస్సై దేవేందర్‌కు తెలియజేశారు. చోరీ జరిగిన 10 ఇండ్లను పరిశీలించగా, వల్లెపు రవి ఇంటిలో రెండు తులాల బంగారం, నగదు రూ. 10వేలు, వల్లెపు ఎల్లస్వామి ఇంట్లో 2తులాల బంగా రం, నగదు రూ. 20వేలు, వల్లెపు సురేశ్‌ అలియాస్‌ సూరి ఇంట్లో 3 తులాల బంగారం, నగదు రూ. 75 వేలు, వల్లెపు సురేశ్‌ ఇంట్లో 2 తులాల బంగారం, 20 తులాల వెండి, రూ. 20 వేల విలువైన బట్టలు, వల్లెపు మల్లయ్య ఇంట్లో 50 తులాల వెండి, అర్ధతులం బం గారం, రూ. 8వేలు, వల్లెపు సుధాకర్‌ ఇంట్లో తులంన్నర బంగారం, 10 తులాల వెండి, రూ. 4 వేలు, వల్లెపు ఐలమ్మ ఇంట్లో 8తులాల బంగారం, రూ. 80 వేలు అపహరణకు గురయ్యాయి. వల్లెపు సమ్మయ్య, వల్లెపు వెంకటయ్య, వల్లెపు శ్రీనివాస్‌ ఇంట్లో ఏమీ దొంగలించలేదు. దొంగతనానికి పాల్పడిన ఇండ్లల్లో పూర్తి వివరాలు సేకరించామని, దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. 

VIDEOS

logo