బుధవారం 03 మార్చి 2021
Warangal-city - Jan 11, 2021 , 00:28:31

అంగరంగ వైభవంగా..

అంగరంగ వైభవంగా..

  • ఘనంగా కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణం
  • హాజరైన మండలి చీఫ్‌విప్‌ బోడకుంటి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

చేర్యాల, జనవరి10 (నమస్తే తెలంగాణ) : కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం ఆదివారం వైభవంగా సాగింది. మల్లన్న స్వామి.. మమ్మేలు స్వామి అంటూ భక్తులు చేసిన నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. స్వామి వారి కల్యాణాన్ని వీక్షించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. స్వామి కల్యాణానికి పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, మల్లారెడ్డి, శాసన మండలి చీఫ్‌విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సమ ర్పించారు. 

కనులపండువగా ఊరేగింపు..

అంతకు ముందు స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను అర్చకులు, ఆలయం నుంచి పోలీసు బొమ్మ, రాతిగీరలు, ఆలయ పరిసరాల్లో ఊరేగించారు. మేళతాళాలు, కోలాటం, చెక్క భజనలు, వేద పాఠశాల విద్యార్థుల శివకీర్తనలతో కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. మహారాష్ట్రలోని షోలాపూర్‌ జిల్లా భార్సీ మఠానికి చెందిన సిద్ధగురు మణికంఠ శివాచార్యుల పీఠాధిపతి పర్యవేక్షణలో స్వామి వారి కల్యాణం  జరిగింది. వీరశైవ ఆగమశాస్త్ర పండితులు, పురోహితులతో పాటు ఆగమ పాఠశాల వేద పండి తులు, విద్యార్థులు స్వామి వారి వివాహ ఘట్టాన్ని ఘనంగా నిర్వహించారు. 

VIDEOS

logo