బుధవారం 03 మార్చి 2021
Warangal-city - Jan 10, 2021 , 01:11:59

యువత సినీరంగంలో రాణించాలి

యువత సినీరంగంలో రాణించాలి

  • వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌

వర్ధన్నపేట, జనవరి 9 : యువత సినీరంగంలో రాణించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ అన్నారు. ఇటీవల నిర్మించిన ‘విందు భోజనం’ సినిమాకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను సినీ హీరో ఎస్‌ఆర్‌ అఖిల్‌రాజ్‌తో కలిసి హన్మకొండలోని ఎమ్మెల్యే స్వగృహంలో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత సందేశాత్మక సినిమాలు నిర్మించాలని సూచించారు. అఖిల్‌రాజ్‌ లాంటి యువకులు సమూహంగా ఏర్పడి సినిమాను నిర్మించడం అభినందనీయమన్నారు. సినిమాల నిర్మాణానికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. కార్యక్రమంలో అరూరి విశాల్‌, సినిమా ప్రతినిధులు పోలపెల్లి రామ్మూర్తి, అంచూరి విజయ్‌కుమార్‌, బుద్దె వెంకన్న, రేణుకుంట్ల ప్రసాద్‌ పాల్గొన్నారు. 

ఎమ్మెల్యేను కలిసిన ఆలయ పాలకవర్గాలు

మడికొండ/హసన్‌పర్తి/ ఐనవోలు : నూతనంగా ఎన్నికైన ఆలయ కమిటీల ప్రతినిధులు శనివారం ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మడికొం డలోని  మెట్టుగుట్ట శివాలయం నూతన పాలకమండలి చైర్మన్‌ బొల్లికొండ రవీందర్‌(పేపర్‌ రవి) కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో మెట్టుగుట్ట డైరెక్టర్లు పల్లపు రాజ్‌కుమార్‌, నిగ్గుల రవి, ఆకుతోట రాజేందర్‌, నల్ల హేమలత, వస్కుల రమేశ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు ఊకంటి వనంరెడ్డి, ఆవాల రాధికారెడ్డి, పోలెపల్లి రామ్మూర్తి ఉన్నారు. అలాగే,  హసన్‌పర్తి ఎర్రగట్టు వేంకట్వేరస్వామి దేవస్థానం చైర్మన్‌గా పిట్టల సదానందం, ధర్మకర్తలుగా వీసం రవీందర్‌రెడ్డి, మూల దేవేందర్‌, మేరగుర్తి రఘు, ఉప్పు ప్రభాకర్‌, మేకల ప్రియాంక, వేల్పుల సదానందాన్ని నియమిస్తూ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు నూతనంగా ఎన్నికైన సభ్యులు ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తోపాటు నగర మేయర్‌ గుండా ప్రకాశ్‌రావును మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో కేయూ పాలకవర్గ సభ్యుడు రాజిరెడ్డి, కార్పొరేటర్‌ జక్కుల శ్రీనివాస్‌, మార్కెట్‌ డైరెక్టర్‌ చకిలం రాజేశ్వర్‌రావు, టీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షులు గడ్డం శివరాంప్రసాద్‌, పావుశెట్టి శ్రీధర్‌, చల్లా వెంకటేశ్వర్లు, రైతుబంధు సమితి కోఆర్డినేటర్‌ అంచూరి విజయ్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బండి రజినీకుమార్‌, చంద్రమోహన్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే,  ఐనవోలు మల్లికార్జునస్వామి దేవస్థానం నూతన పాలకవర్గం సభ్యులు, చైర్మన్‌ మునిగాల సంపత్‌కుమార్‌(సమ్మయ్య) ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సన్మానించారు.  కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ మోహన్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు పొల్లెపల్లి శంకర్‌రెడ్డి, మిద్దెపాక రవీందర్‌, పాలకవర్గ సభ్యులు సింగారపు రాజు, రామోజు సతీశ్‌, లెక్కల వెంకట్‌రెడ్డి, పెద్దబోయిన దేవేంద్ర, జక్కుల రాజు, బుర్ర సంపత్‌, బర్ల అనందం, చెంచు ప్రతాప్‌, చీకటి యుగేంధర్‌, పిట్టల కుమారస్వామి, కళ్లెపు సుధీర్‌ బాబు, దుప్పెల్లి శారద, చిన్నాల ఉప్పలయ్య, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు కత్తి దేవేందర్‌, నాయకులు బుర్ర రాజశేఖర్‌, పూర్ణచందర్‌రావు, ఆగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

VIDEOS

logo