సంజయ్.. రెచ్చగొట్టే మాటలు మానుకో..

- సమీక్షలు గుళ్లదగ్గర కాదు..
- దేవాలయాలతో రాజకీయాలా?
- ప్రజలను మోసం చేయకండి
- అధికారిక సమీక్షకు మేం సిద్ధమే..
- విలేకరుల సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి ధ్వజం
హన్మకొండ, జనవరి 8 : బీజేపీ నాయకులు ప్రజలను రెచ్చగొట్టే మాటలు మానుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హితవు పలికారు. శుక్రవారం సా యంత్రం హన్మకొండలోని మంత్రి క్యాంపు కార్యాలయం (ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్)లో ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలిసి విలేకర్లతో మాట్లాడా రు. ఎన్నికలు వచ్చినప్పుడే బీజేపీ నాయకులకు ఆలయాలు, అభివృద్ధి గుర్తుకు వస్తుందని ఎద్దేవా చేశారు. రోడ్లపై, గుళ్లలో కాకుండా అధికారికంగా కలెక్టరేట్లో కూర్చొని సమీక్షించుకుంటే అసలు విషయాలు బయటకు వస్తాయన్నారు. గుళ్లను వేదికలు చేసుకొని వాదించుకుంటే ప్రజలకు తప్పుడు సమాచారం వెళ్తుందని చెప్పారు. బేస్ లేని నాయకులు కాకుండా మీ కేంద్ర మంత్రులుగానీ, కిషన్‌రెడ్డి గానీ సమీక్షకు వస్తే నేను, మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వస్తామని స్పష్టం చేశారు. వరంగల్‌కు కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చింది.., రాష్ట్రప్రభుత్వం ఎన్ని నిధులు ఖర్చు చేసిందనేది అధికారిక సమీక్షలోనే తెలుస్తుందన్నారు. ఇం దుకు మేము సిద్ధంగా ఉన్నామని మంత్రి సవాల్ విసిరారు. కేంద్రం ఇచ్చిన నిధులతో ఏం చేశామో నయా పైసాతో సహా లెక్క చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షే మం, 24గంటల ఉచిత విద్యుత్ సరఫరా, ప్రభు త్వ దవాఖానల సేవలు, తదిర అంశాల అమలు విషయం లో మీరే తెలంగాణను అభినందించి అవార్డులు ఇచ్చారని అన్నారు. దేశంలోనే అన్ని రాష్ర్టాల్లో కన్నా తెలంగాణలో ఉపాధి కూలీలకు ఎక్కువ పనిదినాలు కల్పించడంతోపాటు రోజుకు రూ.168 కూలీ చెల్లించామన్నారు. ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే రైతులకు లాభం చేకూరుతుందని నాలుగేళ్లుగా కేసీఆర్విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. బండి సంజయ్ రెచ్చగొట్టే మాటలు మానుకొని హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు. దు బ్బాక, హైదరాబాద్ ప్రజలను మోసం చేసినట్లు ఉద్యమకారులు, చైతన్యవంతులైన వరంగల్ ప్రజలను మోసం చేయలేరని అన్నారు. కేంద్రానికి తెలంగాణ రాష్ట్రం వివిధ పన్నుల రూపంలో రూ.2లక్షల 72వేల కోట్లు కడితే, కేంద్రం తెలంగాణకు ఇచ్చింది కేవలం రూ.లక్షా 50వేల కోట్లు మాత్రమేనన్నారు. ములుగు వద్ద గిరిజన యూనివర్సిటీ అక్కడే ఉందన్నారు. అలాగే రైల్వే కోచ్ప్యాక్టరీకి 30 ఎకరాలు అడిగితే 150.05ఎకరాలు ఇచ్చామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇతర రాష్ర్టాలకు ఇచ్చినట్లుగా హైదరాబాద్, వరంగల్ నగరాలకు ఎందుకు వరద సాయం చేయలేదని ప్రశ్నించారు. బీజేపీ నాయకులకు వరంగల్‌పై ప్రేమ ఉంటే నిధులు తీసుకొచ్చి అభివృద్ధికి సహకరించాలన్నారు. మీరు ఇచ్చే నిధులకు మీ పేరే పెడుతామన్నారు. నల్లదనం మొత్తం తీసేస్తే ప్రతి పౌరుడి బ్యాంకు ఖాతాలో రూ.15లక్షలు జమ చేస్తామనన్న మోదీ హా మీ ఏమైందని ప్రశ్నించారు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలు మానుకోవాలని మంత్రి దయాకర్‌రావు హితవు పలికారు. ఈ సమావేశంలో నగర మేయ ర్ గుండా ప్రకాశ్‌రావు, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- ‘మైత్రి సేతు’ను ప్రారంభించనున్న ప్రధాని
- కిడ్నీలో రాళ్లు మాయం చేస్తానని.. బంగారంతో పరార్
- ఏడుపాయల హుండీ ఆదాయం రూ.17లక్షల76వేలు
- సూపర్బ్.. భారతదేశ పటం ఆకారంలో విద్యార్థినులు
- బిగ్ బాస్ హారికకు అరుదైన గౌరవం
- కామాంధుడికి జీవిత ఖైదు
- అరసవల్లి సూర్యనారాయణస్వామిని తాకని భానుడి కిరణాలు
- అలియా భట్ ‘గంగూభాయ్’ సినిమాపై చెలరేగిన వివాదం
- ‘అనంత’ విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య
- శర్వానంద్ నాకు బిడ్డలాంటి వాడు: చిరంజీవి