సోమవారం 08 మార్చి 2021
Warangal-city - Jan 08, 2021 , 01:04:32

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు

  • పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శం
  • సీఎం కేసీఆర్‌ పాలనతో అన్ని వర్గాలకూ లబ్ధి
  • రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
  • దేవరుప్పుల, గొల్లపల్లిలో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు, రైతువేదిక, యాదవ కల్యాణ మండపానికి ప్రారంభోత్సవం
  • అట్టహాసంగా లబ్ధిదారుల గృహప్రవేశం
  • గొల్లపల్లిలో శ్రీకాంతాచారి విగ్రహావిష్కరణ
  • రూ. 4.51 కోట్లతో చెక్‌డ్యాంకు శంకుస్థాపన

దేవరుప్పుల, జనవరి 7 : అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల, గొల్లపల్లిలో కలెక్టర్‌ నిఖిలతో కలిసి పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను గురువారం ప్రారంభించారు. గొల్లపల్లిలో శ్రీకాంతాచారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే సాగునీరు, తాగునీటి విషయంలో పురోగతి సాధించామని, వ్యవసాయాన్ని సులభతరం చేయడంతో పాటు రైతు సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తూ దేశ ప్రజల మెప్పుపొందిన ప్రభుత్వం మనదన్నారు.

 శ్రీకాంతాచారి ఘటన రోజు తానే మొదట స్పందించానని, అప్పట్లో పార్టీ ఏదైనా తాను మొదటి నుంచీ తెలంగాణవాదానికి కట్టుబడి పనిచేశానని గుర్తు చేశారు. శ్రీకాంతాచారి త్యాగం, కేసీఆర్‌ ఉద్యమంలో చూపిన తెగువ, చిత్తశుద్ధి ఫలితంగానే స్వరాష్ట్రం సాధించగా నేడు ఉత్తమ ఫలాలు అందుకుంటున్నామని స్పష్టం చేశారు. చారి ఆశయమైన సాగునీటి కల్పనే ధ్యేయం గా గొల్లపల్లి వాగుపై రూ. 4.51కోట్లతో చెక్‌డ్యాంకు శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. నిర్మాణం పూర్తయితే దేవరుప్పుల, గొల్లపల్లి, మన్‌పహాడ్‌తో పాటు కొడకండ్ల మండలంలోని కొన్ని గ్రామాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు.ఇప్పటికే దేవరుప్పుల వాగుపై నాలుగు చెక్‌డ్యాంలు కట్టామని, మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. ఊహించని రీతిలో భూగర్భజలాలు పెరిగి నేడు యాసంగి పూట కూడా అత్యధికంగా సాగవుతోందన్నారు. గొల్లపల్లి వాగుపై మరో చెక్‌డ్యాం మంజూరు కానుందని, అది కూడా పూర్తయితే ఇక ఈ ప్రాంతంలో సాగునీటికి ఢోకా ఉండదన్నారు. 

డబుల్‌ బెడ్‌రూం ఇండ్లలో ప్రవేశాలు

దేవరుప్పుల, గొల్లపల్లిలో రూ.4.59 కోట్లతో 64 ఇండ్లు నిర్మించగా వాటిని లాటరీ పద్ధతిలో అర్హులకు అందించగా, మంత్రి ఎర్రబెల్లి  చేతుల మీదుగా గృహ ప్రవేశాలు అట్టహాసంగా జరిగాయి. పాలకుర్తి నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 600 ఇండ్లు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, వీటని త్వరలో మంత్రులు కేటీఆర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. ఉత్తమ ఆశయంతో ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి పేదలకు ఇస్తుంటే, ప్రతిపక్షాలు అర్థం లేని మాటలు మాట్లాడుతున్నాయని, నేడు ఇండ్ల లబ్ధిదారులే ప్రతిపక్షాలకు బుద్ధి చెబుతారన్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని చెప్పారు. అనంతరం దేవరుప్పులలో రూ. 15 లక్షలతో కట్టిన పంచాయతీ భవనం, కొత్తవాడలో రూ.15 లక్షలతో కట్టిన యాదవ కల్యాణ మండపాన్ని ప్రారంభించి కల్యాణ మండపానికి మరిన్ని నిధులు కేటాయించి సకల సౌకర్యాలు ఉండేలా చూస్తానని హామీ ఇచ్చారు. 

కార్యక్రమాల్లో సర్పంచ్‌లు ఈదునూరి రమాదేవి, కోనేటి సుభాషిణి, జడ్పీటీసీ పల్లా భార్గవీరెడ్డి, శ్రీకాంతాచారి తల్లిదండ్రులు శంకరమ్మ, వెంకటాచారి, అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌ హమీద్‌, ఆర్డీవో మధుమోహన్‌, గృహ నిర్మాణ శాఖ ఈఈ దామోదర్‌రావు, నీటిపారుదల శాఖ ఈఈ శంకర్‌రావు, డీఈ బాలరాజు, పీఆర్‌ డీఈ దిలీప్‌కుమార్‌, మండల ప్రత్యేకాధికారి కొండాల్‌రెడ్డి, తహసీల్దార్‌ స్వప్న, ఎంపీడీవో ఉమామహేశ్వర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ లింగాల రమేశ్‌ రెడ్డి, రైతు బంధు మండల కన్వీనర్‌ నర్సింహారెడ్డి, కోఆర్డినేటర్లు కారుపోతుల భిక్షపతి, కోతి పద్మ, లీనారెడ్డి, పెద్దారెడ్డి, దయాకర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ కృష్ణమూర్తి, పీఏసీఎస్‌ వైస్‌చైర్మన్‌ నక్క రమేశ్‌, సర్పంచ్‌లు బిళ్ల అంజమ్మ, శ్రీనివాసరెడ్డి, అశోక్‌, మధు, ఎంపీటీసీలు తోటకూరి రేణుక, జాకీర్‌, యాదవ సంఘం అధ్యక్షుడు తోటకూరి రాంచందర్‌, మండల ప్రజాప్రతినిధులు బస్వ మల్లేశ్‌, పల్లా సుందరరాంరెడ్డి, చింత రవి, కొల్లూరు సోమయ్య, జలేంధర్‌రెడ్డి, సోమనర్సయ్య, కిష్టయ్య, కోతి ప్రవీణ్‌, అర్జున్‌, మహేశ్‌, నర్సింహారెడ్డి, కుతాటి నర్సింహులు, ఆలకుంట్ల యాదగిరి, ఆలకుంట్ల మహేశ్‌, దశరథం తదితరులు పాల్గొన్నారు.  

VIDEOS

logo