సోమవారం 08 మార్చి 2021
Warangal-city - Jan 07, 2021 , 02:38:20

150 ఎకరాలు.. రూ. 56 కోట్లు

150 ఎకరాలు.. రూ. 56 కోట్లు

  • వ్యాగన్‌ వర్క్‌షాప్‌ కోసం భూములు సేకరించిన రాష్ట్ర సర్కారు
  • రైల్వే శాఖకు భూమి పత్రాలు అప్పగించిన ప్రజాప్రతినిధులు
  • గ్రేటర్‌ వరంగల్‌లో మరో కీలక ప్రాజెక్టు
  • ఇక పనులే తరువాయి.. 
  • రెండేళ్లలో పూర్తి చేస్తామని ఏడీఆర్‌ వెల్లడి

ఉత్తర, దక్షిణ భారతాలను అనుసంధానం చేసే కాజీపేట ప్రాంతంలో మరో రైల్వే ప్రాజెక్టు సాకారానికి రాష్ట్ర సర్కారు మార్గం సుగమం చేసింది. కాజీపేట జంక్షన్‌ సమీపంలో రైల్వే వ్యాగన్‌ పీరియాడికల్‌ ఓవర్‌హాలింగ్‌ వర్క్‌షాప్‌ ఏర్పాటుకు కావాల్సిన 150.05 ఎకరాల భూమిని రూ.56కోట్లతో సేకరించి రైల్వే శాఖకు అప్పగించింది. భూమి పత్రాలను పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌, మేయర్‌ గుండాప్రకాశ్‌, ఎంపీలు బండా ప్రకాశ్‌, పసునూరి దయాకర్‌, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్‌, నన్నపునేని నరేందర్‌ కలిసి సికింద్రాబాద్‌ రైల్వే ఏడీఆర్‌ సుబ్రహ్మణ్యంకు బుధవారం నగరంలో అందజేశారు. రైలు బోగీల సర్వీసింగ్‌ కోసం రూ.380కోట్లతో చేపట్టే ఈ వర్క్‌షాప్‌ పనులను రెండేళ్లలో పూర్తి చేస్తామని ఏడీఆర్‌ వెల్లడించారు. 

- వరంగల్‌, జనవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)

వరంగల్‌, జనవరి 6(నమస్తే తెలంగాణ ప్రతినిధి): దేశ ఉత్తర, దక్షిణ ప్రాంతాలను అనుసంధానం చేసే కా జీపేట రైల్వే జంక్షన్‌లో మరో ప్రాజెక్టు సాకారం కాబో తున్నది. కాజీపేట సమీపంలో రైల్వే పీవోహెచ్‌(పీరి యాడికల్‌ వ్యాగన్‌ ఓవర్‌ హాలింగ్‌) వర్క్‌షాప్‌ ఏర్పా టుకు మార్గం సుగమమైంది. దీనికి అవసరమైన 150.05 ఎకరాల భూమిని రాష్ట్రప్రభుత్వం రైల్వే శాఖ కు అప్పగించింది. దీంతో వేగంగా నిర్మాణ ప్రక్రియను పూర్తి చేయాల్సిన బాధ్యత రైల్వే శాఖపైనే ఉంది. పను లు మొదలుపెట్టిన రెండేండ్లలో పూర్తి చేస్తామని రైల్వే ఏడీఆర్‌ సుబ్రహ్మణ్యం తెలిపారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌, గ్రేటర్‌ వరంగ ల్‌ మేయర్‌ గుండాప్రకాశ్‌, ఎంపీలు బండా ప్రకాశ్‌, పసునూరి దయాకర్‌, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్‌, నన్నపునేని న రేందర్‌ కలిసి సికింద్రాబాద్‌ రైల్వే ఏడీఆర్‌ సుబ్రహ్మ ణ్యానికి భూమి స్వాధీన పత్రాలను అందజేశారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మం తు, గ్రేటర్‌ వరంగల్‌ కమిషనర్‌ పమేలా సత్పతి, రైల్వే ఏడీఎం ఎస్‌ఎస్‌ మిశ్రా, లోకోస్‌ సీఎంఈ శ్రీవాత్సవ్‌ తదితరులు పాల్గొన్నారు. రూ.380 కోట్లతో వ్యాగన్‌ పీరియాడికల్‌ ఓవర్‌ హాలింగ్‌ వర్క్‌షాప్‌ను రైల్వే శాఖ నిర్మించనుంది. రైళ్ల డబ్బాలను ఎప్పటికప్పుడు సర్వీ సింగ్‌ చేసేందుకు దీన్ని ఉపయోగించనున్నారు. వర్క్‌ షాప్‌ ఏర్పాటుకు అవసరమైన 150.05 ఎకరాల భూ మి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.56.86 కోట్లను విడు దల చేసింది. వర్ధన్నపేట నియోజకవర్గం కాజీపేట మండలం మడికొండ శివారులోని సీతారామాచంద్ర స్వామి ఆలయానికి చెందిన ఈ భూమిని సేకరించి ఇ చ్చింది. ఎకరానికి రూ.30 లక్షల చొప్పున మొత్తం రూ. 45.03 కోట్లు అయ్యింది. అప్పటికే ఈ భూమిలో ఉంటున్న 114 మందికి కూడా ఎకరానికి రూ.8 లక్షల చొప్పున రూ.11.82 కోట్ల ఎక్స్‌గ్రేషియా చెల్లించింది. 

త్వరగా చేపట్టాలి: మంత్రి ఎర్రబెల్లి

కోచ్‌ ఫ్యాక్టరీ వరంగల్‌ జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్ష అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గతంలో మంజూరైన ఫ్యాక్టరీ వేరే రాష్ర్టానికి తరలిపోయిందని.. దీనికి బదులుగా రైల్వే వ్యాగన్‌ పీరియాడికల్‌ ఓవర్‌ హాలింగ్‌ వర్క్‌షాప్‌ వచ్చిందని తెలిపారు. వర్క్‌షాప్‌ ఏర్పాటుకు అవసరమైన భూమిని అప్పగించామ ని, రైల్వే అధికారులు పనులు త్వరగా చేపట్టాలని కోరారు. కేంద్రంపై ఒత్తిడి పెంచి రాష్ర్టానికి న్యాయంగా రావాల్సిన కోచ్‌ ఫ్యాక్టరీని సాధిస్తామన్నారు. సీఎం కేసీఆర్‌, మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ సహకారంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రజాప్రతినిధు లందరం దీని కోసం ఢిల్లీకి వెళ్తామని వివరించారు. కాజీపేట రైల్వే లైనుకు మూడు వైపులా మార్గాలున్నందున డివిజన్‌ హోదా కల్పించాలని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ విన య్‌భాస్కర్‌ రైల్వే శాఖను కోరారు. వ్యాగన్‌ ఫ్యాక్టరీ కోసం దేవాదాయ శాఖ భూ ములు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వ్యవహరించామని తెలిపా రు.

రైతులకు అండగా: ఎమ్మెల్యే అరూరి

వ్యాగన్‌ వర్క్‌షాప్‌ కోసం కేటాయించిన దేవాదాయ శాఖ భూములను సాగు చేసుకుంటున్న వారికి ప్రభుత్వం ఆసరాగా నిలిచిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ అన్నారు. దేవాదాయ శాఖ భూములు అయినా వీటిపై ఆధారపడిన 114 మందికి ఎకరానికి రూ.8 లక్షల చొప్పున మొత్తం రూ.11.82 కోట్లను ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. వ్యాగన్‌ వర్క్‌షాపు ఏర్పాటవుతున్న ప్రాంతం వర్ధన్నపేట నియోజకవర్గంలో ఉందని, వేగంగా పనులు పూర్తయ్యేందుకు తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. 

VIDEOS

logo