వరంగల్ Vs వారణాసి

- ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న నగరంతో పోటీ
- వీధి వ్యాపారులకు రుణాల్లో ముందు వరుసలో ఓరుగల్లు
- దేశంలోనే రెండోవ స్థానంలో ‘గ్రేటర్'
- అగ్రస్థానం కోసం రేసులో చారిత్రక నగరాలు
- గడువులోగా వంద శాతం పూర్తయ్యేలా అధికార యంత్రాంగం చర్యలు
- జనవరి 26న అవార్డుల ప్రదానం
వీధి వ్యాపారులకు రుణాల మంజూరులో గ్రేటర్ వరంగల్, ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ‘వారణాసి’తో పోటీపడుతోంది. కరోనాతో ఉపాధి కోల్పోయిన వారికి రూ.10వేల చొప్పున రుణాలిస్తూ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. వరంగల్‌లో ఇప్పటివరకు 22,358మంది లబ్ధిదారులకు రుణాలు అందగా, వారణాసిలో అదనంగా 157మందికి లబ్ధిచేకూరింది. ఈ నేపథ్యంలో ఈ నెల 22లోగా వంద శాతం పూర్తిచేసి మొదటిస్థానం దక్కించుకునేందుకు అధికార యంత్రాంగం కృషిచేస్తోంది. మొత్తం 100 కార్పొరేషన్లు, 1500 మున్సిపాలిటీలు, 2100 నగర పంచాయతీల్లో పీఎం స్వనిధి పథకం అమలవుతుండగా పనితీరు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం జనవరి 26న అవార్డులు అందించనుంది.
వరంగల్, జనవరి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా కాలం లో ఉపాధి కోల్పోయిన వీధి వ్యాపారస్తులకు రుణాల మంజూరులో వరంగల్ ముందంజలో ఉన్నది. రూ.10 వేల చొప్పున అప్పులు ఇవ్వడంలో వరంగల్ మహానగరం దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానం సాధించేందుకు వారణాసితో పోటీ పడుతున్నది. 10 లక్షలలోపు జనాభా ఉన్న నగరాల కేటగిరిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి, వరంగల్ నగరాలు పోటీ పడుతున్నాయి. రుణాలు పొందిన లబ్ధిదారుల సంఖ్యాపరంగా వరంగల్ కంటే వారణాసిలో 157మంది ఎక్కువగా ఉన్నారు. వారణాసిలో 22,515 మంది, వరంగల్ మహా నగరంలో 22,358 మంది వీధివ్యాపారులకు రుణాలు అందాయి. రెండు నగరాలు మొదటి స్థానం కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి. జనవరి 15 నాటికి ఎంపిక చేసిన ప్రతి వీధివ్యాపారికి రుణాలు అందే లా మున్సిపల్ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
నగరాలు, పట్టణ జనాభాలో ఐదు శాతం మంది వీధివ్యాపారులు ఉంటారని, వారిని గుర్తించి రుణాలు అందజేయాలని కేంద్ర ప్రభు త్వం ‘పీఎం స్వనిధి’ పేరుతో కొత్త పథకాన్ని రూపొందించింది. దేశంలోని 100 కార్పొరేషన్లు, 1500 మున్సిపాలిటీలు, 2100 నగర పంచాయతీల్లో ఈ పథకం అమలవుతున్నది. పథకం అమలులో పనితీరు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం జనవరి 26న అవార్డులను ప్రదా నం చేయనుంది. తుది గడువులోపు వంద శాతం మందికి రుణాలు అందజేస్తే దేశంలోనే అగ్రస్థానంలో ఉండనుంది. గడువులోపు వంద శాతం మందికి రుణాలు అందిస్తే గ్రేటర్ వరంగల్ అగ్రస్థానంలో నిలువనుంది. ప్రస్తుత పరిస్థితి కొనసాగినా రెండో స్థానంలో ఉంటుంది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) సిబ్బంది క్షేత్రస్థాయిలో సర్వే చేసి రుణాలకు అర్హులైన వ్యాపారులను గుర్తించారు. రుణాల మంజూరు కోసం బ్యాంకర్లతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌తోపాటు మరో తొమ్మది మున్సిపాలిటీలు ఉన్నాయి. వీధివ్యాపారులకు రుణాల మం జూరులో మహబూబాబాద్ మున్సిపాలిటీ ముం దుంది. అన్ని మున్సిపాలిటీలోనూ వీధివ్యాపారులు జనవరి 22లోపు రుణాలు పొందేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది.
తాజావార్తలు
- కాంగ్రెస్‌లో ఉంటే జ్యోతిరాధిత్య సింథియా సీఎం అయ్యేవారు..
- గురుద్వారాలో ఉచిత డయాలసిస్ కేంద్రం.. ఎక్కడంటే!
- సరిహద్దులో భారత సైన్యం ఆటా-పాటా
- అన్ని సార్లూ అన్నం మంచిది కాదట!
- మహిళలు చేసిన వస్తువులు కొన్న ప్రధాని మోదీ
- ఒక రోజు హోంమంత్రిగా మహిళా కానిస్టేబుల్..
- దేశంలో ఎక్కువ మొక్కలు నాటింది తెలంగాణే : కేంద్రం
- వేరొకరితో నిశ్చితార్ధం : గర్ల్‌ఫ్రెండ్‌తో పాటు ఆమె తల్లిని కడతేర్చాడు!
- బాలయ్యను ఫాలో అవుతున్న పవన్.. తొలిసారి అలా!
- మహిళల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి