లింగభేదం.. శిక్షార్హం

- అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ సమానమే..
- లింగ నిర్ధారణ నివారణకు పటిష్ట చర్యలు
- ఆడపిల్లల రక్షణకు ప్రత్యేక కార్యాచరణ
- స్కానింగ్ సెంటర్లు, నర్సింగ్ హోంలపై నిరంతర నిఘా
అమ్మాయి.. అబ్బాయి రెండు కళ్లలాంటి వారైనా ఇంకా కొన్ని ప్రాంతాల్లో మహిళలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. సాంఘిక కట్టుబాట్లు, వరకట్న దురాచారం, శారీరక, మానసిక వేధింపుల వంటి వాటి వల్ల ఆడపిల్లలకు జన్మనివ్వాలంటేనే మహిళలు వెనుకాడుతున్నారు. తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల బలహీనతను ఆధారం చేసుకొని పుట్టబోయేది ఆడబిడ్డ అయితే అబార్షన్లకు పాల్పడుతున్నారు. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం స్కానింగ్ సెంటర్లు, నర్సింగ్ హోంలపై నిరంతర నిఘా వేసింది.
- వరంగల్ చౌరస్తా
ముందు నుంచే పర్యవేక్షణ
మహిళ గర్భం దాల్చిన వెంటనే ఆమె పూర్తి వివరాలను అంగన్వాడీ సెంటర్, స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నమోదు చేసుకుంటున్నారు. ప్రభుత్వం అందజేస్తున్న పౌష్టికాహారం అందిస్తూ, ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్యుల సూచనల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తూ, గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్య పరిరక్షణ చర్యలను సైతం తెలియజేస్తున్నారు. అంతేకాకుండా లింగనిర్ధారణ కోసం ప్రయత్నిస్తున్న విషయాలపై సైతం నిఘాను కొనసాగించి వారికి అవగాహన కల్పిస్తున్నారు.
ఎన్ని చట్టాలున్నా భ్రూణ హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. రోజురోజుకూ అమ్మాయిల నిష్పత్తి తగ్గుతూనే ఉంది. అమ్మాయిల సంఖ్యను మెరుగుపరచడానికి ప్రభుత్వం కళాజాత, సదస్సులు నిర్వహిస్తూ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నది. వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలో 196 స్కానింగ్ సెంటర్లు రిజిస్ట్రేషన్లు కాగా, ప్రస్తుతం 160 పనిచేస్తున్నాయి. వాటిపై నిరంతరం పర్యవేక్షణతోపాటు నిఘా వేసింది. లింగనిర్ధారణ పరీక్షలకు సంప్రదించిన వారి వివరాలను తమ దృష్టికి తీసుకురావాలని అధికారులు తెలియజేస్తున్నారు. స్కానింగ్ సెంటర్లలో లింగనిర్ధ్థారణ పరీక్షలు, అబార్షన్న్లు చేస్తే వెంటనే సమాచారం అందించాలని కోరుతున్నారు.
లింగ ఎంపిక నిషేధ చట్టం
భ్రూణ హత్యలను అరికట్టేందుకు ప్రభుత్వం గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టం 1994లో ప్రీ కాన్సెప్షన్ అండ్ ప్రీ నాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్(పీఎన్డీటీ) అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం స్కానింగ్ సెంటర్లు, నర్సింగ్ హోంలు నడుచుకోవాల్సి ఉంటుంది.గర్భిణికి అవసరాన్ని బట్టి పిండం ఎదుగుదలకు చెందిన పరీక్షలు మాత్రమే చేయాలి. మరే ఇతర పరీక్షలు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటారు.
- గర్భంలోని పిండం ఆడా, మగా అనే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో బహిర్గతం చేయరాదు.
- స్కానింగ్ పరీక్షలు నిర్వహించిన మహిళ వివరాలను, పరీక్షలను రికార్డుల్లో నమోదు చేయాలి.
- ఒక రేడియాలజిస్టు రెండుకు మించి స్కానింగ్ సెంటర్లలో విధులు నిర్వహించకూడదు.
- లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించి పట్టుబడినట్లుయితే సంబంధిత సెంటర్ రిజిస్ట్రేషన్ రద్దుతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు.
- నిజనిర్ధారణ జరిగినట్లయితే చట్టపరిధిలో మూడేళ్లు లేదా అంతకు మించి జైలుశిక్ష, రూ. పది వేలు లేదా అంతకు మించి జరిమానా విధిస్తారు.
స్కానింగ్ సెంటర్లు నిర్వహించిన వైద్యపరీక్షలకు పూర్తి బాధ్యత సెంటర్కు అనుసంధానంగా ఉన్న రేడియాలజిస్టుతోపాటు గైనకాలజిస్టులకు సైతం ఉంటుంది. వారిపై సైతం చర్యలు తీసుకుంటారు.
నిరంతర పర్యవేక్షణప్రస్తుతం అర్బన్ జిల్లా పరిధిలో బాలికల నిష్పత్తి 1000:916గా ఉంది. వేలేరు, ధర్మసాగర్, కమలాపూర్ మండలాల్లో నిష్పత్తి మరీ తక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. వైద్యులతోపాటు ఆర్ఎంపీ, పీఎంపీలు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్ల ద్వారా చైతన్యం కల్పిస్తున్నాం. కలెక్టర్ ఆదేశాలతో ఐసీడీఎస్ వారితో కలిసి క్షేత్రస్థాయి అవగాహన, పర్యవేక్షణ చర్యలను పెంచాం. నర్సింగ్ హోంలు, స్కానింగ్ సెంటర్లపై నిరంతర నిఘాను కొనసాగిస్తున్నాం. ఆకస్మిక తనిఖీలు నిర్వహించి రికార్డులను పరీక్షిస్తున్నాం. రికార్డు నిర్వహణ సరిగాలేని వారికి సైతం నోటీసులు జారీ చేస్తున్నాం.
- డాక్టర్ కే లలితాదేవి, అర్బన్ జిల్లా డీఎంహెచ్వో
తాజావార్తలు
- ఆన్లైన్లో భద్రాద్రి రామయ్య కల్యాణం టికెట్లు
- ఇక స్కూళ్లల్లోనూ ఇంటర్ పరీక్ష కేంద్రాలు
- లాస్యతో కుమార్ సాయి స్టెప్పులు... వీడియో వైరల్
- తిరుపతి మార్గంలో 18 రైళ్లు రద్దు: ఎస్సీఆర్
- పదేండ్ల తర్వాత టీటీడీ కల్యాణమస్తు
- నేడు బీజేపీ ఎన్నికల కమిటీ భేటీ.. తొలి విడత అభ్యర్థుల ప్రకటన!
- స్నేహితురాలి పెళ్లిలో తమన్నా సందడి మాములుగా లేదు
- బ్లాక్ డ్రెస్లో రాశీ ఖన్నా గ్లామర్ షో అదిరింది...!
- ‘మోదీ ఫొటోలను తొలగించండి’
- బిల్డింగ్పై నుండి కింద పడ్డ నటుడు.. ఆసుపత్రికి తరలింపు