వేటు పడింది..

- పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంలో బాధ్యులపై చర్యలు
- పౌరసరఫరాల సంస్థ వీసీ ఉత్తర్వులు
- ‘ఏనుమాముల’ టీఏను టర్మినేట్ చేసిన అర్బన్ జిల్లా కలెక్టర్
- రైస్మిల్లర్పైనా చర్యలకు ఆదేశాలు
- మిల్లులో ధాన్యం తరలింపునకు నిర్ణయం
- ఆసక్తి రేపుతున్న దుర్గంపేట కేసు
- టీఏను టర్మినేట్ చేసిన అర్బన్ కలెక్టర్
- రైస్‌మిల్లర్‌పై చర్యలకు ఆదేశాలు జారీ
- (వరంగల్‌రూరల్- నమస్తేతెలంగాణ)
కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కింద రైస్‌మిల్లర్ డెలివరీ చేసిన బియ్యం పీడీఎస్ రైస్ అని తేలటంతో బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల సంస్థ వైస్ చైర్మన్ అనిల్‌కుమార్ ఉత్తర్వులు విడుదల చేశారు. పీడీఎస్ రైస్‌ను పౌరసరఫరాల సంస్థ గోడౌన్‌లోకి అనుమతించిన టెక్నికల్ అసిస్టెంట్ (టీఏ) రాంచందర్‌పై వేటు పడిం ది. ఈ మేరకు వరంగల్అర్బన్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. పీడీఎస్ రైస్‌ను సీఎంఆర్ కింద డెలివరీ చేసిన రైస్‌మిల్లర్‌పై చర్యలు తీసకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వరంగల్‌రూరల్ జిల్లా ఆత్మకూరు పోలీసుస్టేషన్ పరిధిలోని దుర్గంపేట వద్ద ఇటీవల పోలీసులు పీడీఎస్ రైస్‌ను పట్టుకోవడం, విచారణలో వరంగల్అర్బన్ జిల్లా కాజీపేట మండలం రాంపూర్‌లోని ఓ రైస్‌మిల్లర్ అంతకు ముందు ఇక్కడి నుంచి పీడీఎస్ రైస్ తీసుకెళ్లి వరంగల్ ఏనుమాములలోని పౌరసరఫరాల సంస్థ గోడౌన్లో దింపటం, వీటిని సీఎంఆర్ కింద గోడౌన్ టీఏ పాస్ చేసి మిల్లర్‌కు ఆక్సెప్టెన్సీ లెటర్ ఇవ్వటం వంటివి బయటపడటంతో పోలీసుల అభ్యర్థన మేరకు పౌరసరఫరాల సంస్థ అధికారులు ఏనుమాముల గోడౌన్లో సదరు రైస్‌మిల్లర్ దింపిన రైస్‌ను రీ అనాలసిస్ చేసిన విషయం తెలిసిందే. రీ అనాలసిస్ నివేదికను పౌరసరఫరాల సంస్థ వరంగల్‌రూరల్ జిల్లా మేనేజరు(డీఎం) భాస్కర్‌రావు కొద్ది రోజుల క్రితం తమ సంస్థ వీసీ అనిల్‌కుమార్‌కు పంపారు. రాంపూర్ రైస్‌మిల్లర్ సీఎంఆర్ కింద డెలివరీ చేసిన బియ్యం పీడీఎస్ రైస్ అని అతను తన నివేదికలో స్పష్టం చేశారు. దీన్ని పరిశీలించిన వీసీ అనిల్‌కుమార్ ఈ వ్యవహారంలో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. ఈ నేపథ్యంలో ఏనుమాముల గోడౌన్ వద్ద రాంపూర్ రైస్‌మిల్లర్ సీఎంఆర్ కింద డెలివరీ చేసిన పీడీఎస్ రైస్ క్వాలిటీ, క్వాంటిటీ పరిశీలించి ఆక్సెప్టెన్సీ ఇచ్చిన టీఏ రాంచందర్‌ను కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంత్ టర్మినేట్ చేశారు.
రాంపూర్ రైస్‌మిల్లర్‌పై చర్యలకు ఆదేశం
సీఎంఆర్ కింద పీడీఎస్ రైస్‌ను పౌరసరఫరాల సంస్థకు డెలివరీ చేసిన రాంపూర్ రైస్మిల్లర్పైనా చర్యలు తీసుకోవాలని వరంగల్అర్బన్ కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో పౌరసరఫరాల సంస్థ అధికారులు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా తొలుత సదరు రైస్‌మిల్లర్ రాంపూర్‌లో నిర్వహిస్తున్న మిల్లులో నిల్వ ఉన్న ధాన్యాన్ని స్వాధీన పరచుకుని ఇతర రైస్‌మిల్లర్లకు అప్పగించే పనిలో ఉన్నారు. ఈ రైస్‌మిల్లర్‌కు గత యాసంగి సీజన్లో పౌరసరఫరాల శాఖ అధికారులు సీఎంఆర్ కోసం పెద్ద సంఖ్యలో ధాన్యం కేటాయించారు. ఇందులో సుమారు ఐదు వేల టన్నుల ధాన్యం రాంపూర్‌లోని అతడి రైస్‌మిల్లులో ఉన్నట్లు తెలిసింది. రైస్‌మిల్లర్‌పై చర్యలు తీసుకోవడానికి ముందు అతడి మిల్లులో నిల్వ ఉన్న ప్రభుత్వానికి చెందిన ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు స్వాధీన పరుచుకుని మిల్లింగ్ కోసం ఇతర రైస్‌మిల్లర్లకు అప్పగించాల్సి ఉంది. రికార్డుల ప్రకారం రాంపూర్‌లోని సదరు రైస్‌మిల్లర్ మిల్లులో నిల్వ ఉండాల్సిన సీఎంఆర్ ధాన్యం నిల్వల్లో తేడాలున్నట్లు, కొంత ధాన్యం పాడైనట్లు అధికారుల పరిశీలనలో బయటపడిందని సమాచారం. దీనిపై గ్యారంటీలను బాధ్యులను చేసి చర్యలు తీసుకోవటంలో ముందుకెళ్లాల్సిన పౌరసరఫరాల శాఖ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నట్లు తెలిసింది. రైస్‌మిల్లర్ నుంచి ధాన్యం స్వాధీన పరుచుకున్న తర్వాత అధికారులు మిల్లర్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తి రేపుతుంది. ఈ కేసులో పోలీసులు తీసుకోబోయే చర్యలపైనా ఉత్కంఠ నెలకొంది.
తాజావార్తలు
- తెలంగాణ ఎంసెట్ సిలబస్ తగ్గింపు?
- నల్లగొండలో ఇద్దరు వ్యక్తుల దారుణ హత్య
- ఎస్సెస్సీ పోటీ పరీక్షల కోసం టీశాట్ ప్రసారాలు
- బక్కచిక్కిన ముద్దుగుమ్మ.. నమ్మలేకపోతున్న ఫ్యాన్స్
- వాహ్.. వాగులో వాలీబాల్..!
- ఆంబోతుల ఫైట్.. పంతం నీదా..? నాదా..?
- పోలీసు మానవత్వం.. మూగజీవాన్ని కాపాడాడు..
- ప్రముఖ టిక్ టాక్ స్టార్ ఆత్మహత్య.. నెల్లూరు టౌన్లో కలకలం
- తెలంగాణ కశ్మీరం @ ఆదిలాబాద్
- అనుకోకుండా కలిసిన 'గ్యాంగ్ లీడర్' బ్రదర్స్