సోమవారం 01 మార్చి 2021
Warangal-city - Dec 17, 2020 , 00:07:40

మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

  • సర్కారు పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
  •  పల్లె ప్రగతితోనే గ్రామాలు అభివృద్ధి
  • ప్రజల ఆశీర్వాదంతో గెలిచా.. సీఎం కేసీఆర్‌ దయతో మంత్రినయ్యా
  • పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
  • పాలకుర్తిలో రూ. 100 కోట్ల రుణాల పంపిణీ
  • లబ్ధిదారులకు గేదెలు, కోళ్లు, ఈ-ఆటోలు అందజేత

పాలకుర్తి రూరల్‌, డిసెంబర్‌ 16: మహిళల ఆర్థికాభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని బృందావన్‌ గార్డెన్‌లో స్త్రీనిధి ద్వారా మంజూరైన రూ.100 కోట్ల రుణాలను పంపిణీ చేశారు. ఆనంతరం స్త్రీనిధి సురక్ష బీమా పథకాన్ని ప్రారంభించారు. మహిళలకు పాడి గేదెలు, కోళ్లు, ఈ-ఆటోలను అందజేశారు. స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లికి మ హిళలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం దయాకర్‌రావు మాట్లాడుతూ మహిళలు ప్రభుత్వ పథకాలు, రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రతి డ్వాక్రా మహిళకు రూ. 3 లక్షల వ్యక్తిగత రుణాన్ని మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. గేదెలతో పాల ఉత్పత్తి పెంచాలని అన్నారు. నాడు ఎన్టీఆర్‌, నేడు సీఎం కేసీఆర్‌ మహిళా సంక్షేమానికి కృషి చేస్తున్నా రన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2లక్షల 23వేల కోట్లతో 423 గ్రూపుల్లోని 6వేల మందికి, 1413 సంఘాలకు రూ. 33 కోట్ల 84లక్షల రుణాలను పంపిణీ చేశామన్నారు. ప్రజల ఆశీర్వాదం, సీఎం కేసీఆర్‌ దయతో మంత్రిని అయ్యానని, అందరి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానన్నారు. పాలకుర్తిని అభివృద్ధిలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలుపుతానని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో జనగామ జిల్లా ను అభివృద్ధిలో ముందుంచుతానన్నారు. నియోజకవర్గంలోని యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తానన్నారు. పల్లె ప్రగతితో గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాయన్నారు. ఇందులో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. మహిళలు, రైతులు గేదెలు, కోళ్ల పెంపకం, కూరగాయల సాగు వంటి వాటిపై దృష్టి సారించాలని జనగామ జిల్లా కలెక్టర్‌ నిఖిల అన్నారు. పల్లె ప్రగతి పనులను జనగామజిల్లాలో 100శాతం పూర్తి చేశామన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి, స్త్రీనిధి మేనేజింగ్‌ డైరెక్టర్‌ విద్యా సాగర్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ ఎండీ హమీద్‌, స్త్రీనిధి చైర్‌పర్సన్‌ అనిత, సుమలత, డీఆర్డీవో గూడూరు రాంరెడ్డి, డీసీసీబీ వైస్‌చైర్మన్‌ కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీపీలు నల్లానాగిరెడ్డి, బస్వ సావిత్రి, జడ్పీ టీసీలు పల్ల భార్గవి, పుస్కూరి శ్రీనివాసరావు, కేలోతు సత్తమ్మ, వీరమనేని యాకాంతారావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు తీగల దయాకర్‌, పసునూరి నవీన్‌, ఎంపీడీవో అశోక్‌కుమార్‌, ఏపీఎం రమణాచారి, తదితరులు పాల్గొన్నారు.

రూ. 2400 కోట్లతో రుణాల పంపిణీ

రాష్ట్రవ్యాప్తంగా స్త్రీనిధి ద్వారా మహిళలకు రూ. 2400 కోట్లతో రుణాలను పంపిణీ చేశాం. ప్రతి కుటుం బానికి రుణ సదుపాయం కల్పిస్తాం. కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి చెందాయి. ప్రతి గ్రామం క్లీన్‌ అండ్‌ గ్రీన్‌గా ఉండాలి. గ్రామాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలి. 

- పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీప్‌కుమార్‌ సుల్తానియా


VIDEOS

తాజావార్తలు


logo