శనివారం 23 జనవరి 2021
Warangal-city - Dec 05, 2020 , 02:11:19

పనులను వేగంగా పూర్తి చేయాలి

పనులను వేగంగా పూర్తి చేయాలి

  • పల్లెప్రగతి అభివృద్ధి పనుల్లో అలసత్వం వద్దు
  • నర్సంపేట డీఎల్‌పీవో వెంకటేశ్వర్లు

చెన్నారావుపేట: అన్ని గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని నర్సంపేట డీఎల్‌పీవో వెంకటేశ్వర్లు సూచించారు. శుక్రవారం ఆయన మండలంలోని తోపనగడ్డతండా, కందిగడ్డతండా, ధర్మతండా, పదహారుచింతల్‌తండాలో వైకుంఠధామాల పురోగతిని పరిశీలించారు. వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డుల నిర్మాణ పనుల్లో ఎవరూ అలసత్వం వహించొద్దన్నారు.  నిర్లక్ష్యం చేసే సర్పంచ్‌లకు నోటీసులు జారీ చేస్తామన్నారు. ఆయన వెంట ఎంపీవో సురేశ్‌, సర్పంచ్‌లు బానోత్‌ శ్రీనివాస్‌, గుగులోత్‌ రాజమ్మ, ఆంగోత్‌ అరుణ, బానోత్‌ శారద, గణేశ్‌, గుగులోత్‌ కృష్ణ, కార్యదర్శులు రాజ్‌కుమార్‌, అశోక్‌ ఉన్నారు.

నెల రోజుల్లో పనులు పూర్తి చేయాలి

శాయంపేట: మండలంలోని అన్ని గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణ పనులను నెల రోజుల్లో పూర్తి చేయాలని ఎంపీవో రంజిత్‌కుమార్‌ సూచించారు. నర్సింహులపల్లిలో వైకుంఠధామం పనులను ఆయన పరిశీలించారు. కొందరు సర్పంచ్‌లు ఇంకా పనులను ప్రారంభించకపోవడం సరికాదన్నారు. గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయని సర్పంచ్‌లను సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు. మండలంలో విలేజ్‌ పార్కుల నిర్మాణాలు ఊపందుకున్నట్లు తెలిపారు.

విలేజ్‌ పార్కులను త్వరగా పూర్తి చేయాలి

దుగ్గొండి: గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న విలేజ్‌ పార్కుల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని ఎంపీడీవో గుంటి పల్లవి సూచించారు. ఆమె శివాజీనగర్‌లో స్థానిక ప్రజాప్రతినిదులతో కలిసి పల్లెప్రగతి వనం పురోగతిని పరిశీలించారు. విలేజ్‌ పార్కుల్లో రకరకాల మొక్కలు నాటి కాపాడాలని కోరారు. ఆమె వెంట ఎంపీవో శ్రీధర్‌గౌడ్‌, సర్పంచ్‌ లింగంపల్లి ఉమ-రవీందర్‌రావు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు, గ్రామ అధ్యక్షుడు మాలగాని రామారావు, కార్యదర్శి వల్లె వినోద్‌కుమార్‌, వార్డు సభ్యులు రామారావు, రజిత, ఇంగన్న, ఆర్‌బీఎస్‌ కన్వీనర్‌ సుకినె శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ప్రకృతి వనాలను సంరక్షించుకోవాలి

వర్ధన్నపేట: స్థానికులకు ఆహ్లాదాన్ని పంచేందుకు ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాలను సంరక్షించుకోవాలని ఎంపీడీవో రాజ్యలక్ష్మి సూచించారు. బండౌతాపురం, బొబ్బిలికోటలో ఏర్పాటు చేసి విలేజ్‌ పార్కులను ఏపీవో నాగేశ్వర్‌తో కలిసి ఆమె పరిశీలించారు. పార్కుల్లో వనాలు పెరిగితే గ్రామాలకు కొత్త శోభ వస్తుందన్నారు.

సర్పంచ్‌లు నిర్లక్ష్యం చేయడం సరికాదు

ఖానాపురం: పల్లెప్రగతి పనుల్లో సర్పంచ్‌లు నిర్లక్ష్యం చేయడం సరికాదని ఎంపీడీవో సుమనావాణి అన్నారు. మనుబోతులగడ్డ, బండమీదిమామిడితండా, రంగాపురంలో నర్సరీలు, డంపింగ్‌ యార్డులు, శ్మశాన వాటికలు, విలేజ్‌ పార్కుల పనులను ఆమె పరిశీలించారు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ పనులు పూర్తి కాలేదన్నారు. ఈ నెలాఖరులోగా వందశాతం పనులు పూర్తి కావాలన్నారు.

తాజావార్తలు


logo