ఆదివారం 17 జనవరి 2021
Warangal-city - Dec 05, 2020 , 01:36:15

పట్టణం మెరిసేలా..ప్రజలు మురిసేలా..

పట్టణం మెరిసేలా..ప్రజలు మురిసేలా..

 • పట్టణ ప్రగతి పక్కా అమలుకు సర్కారు చర్యలు

నగరాలు, పట్టణాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా చేపట్టిన ‘పట్టణ ప్రగతి’ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రగతి పనుల్లో ఎక్కడా జాప్యం ఉండకూడదని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఆదేశాలు జారీ చేసింది. చేపట్టాల్సిన అన్ని పనుల వివరాలతో నాలుగేళ్ల ప్రణాళిక రూపొందించాలని సూచించింది. అభివృద్ధి పనుల్లో వేగం కోసమే ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలని పేర్కొంది. ప్రభుత్వ నిధులు ఖర్చు చేయడంలో కొన్ని మున్సిపాలిటీల్లో జరుగుతున్న జాప్యాన్ని నివారించే ఉద్దేశంతో తాజాగా ఈ స్పష్టతనిచ్చింది.

- వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ

 • వేగంగా అభివృద్ధికి నాలుగేళ్ల ప్రణాళిక
 • రెండేళ్లలో చేపట్టే పనులకు ముందస్తుగా నిధుల మంజూరు
 • ఉమ్మడి జిల్లా నగర, పురపాలికలకు ప్రతి నెలా రూ.36.07 కోట్లు 
 • ఒక్క గ్రేటర్‌ వరంగల్‌కే రూ.7.35 కోట్లు
 • పారిశుధ్యం, అభివృద్ధే లక్ష్యంగా ముందుకు 
 • పట్టణ ప్రగతి పక్కా అమలుకు సర్కారు చర్యలు
 • వేగంగా అభివృద్ధికి నాలుగేళ్ల ప్రణాళిక
 •  రెండేళ్లలో చేపట్టే పనులకు ముందస్తుగా నిధుల మంజూరు
 • ఉమ్మడి జిల్లా నగర, పురపాలికలకు ప్రతి నెలా రూ.36.07 కోట్లు 
 • ఒక్క గ్రేటర్‌ వరంగల్‌కే రూ.7.35 కోట్లు 

వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : నగరాలు, పట్టణాల సమగ్రాభివృద్ధి కోసం పట్టణ ప్రగతి పనుల్లో ఎక్కడా జాప్యం ఉండకూడదని అన్ని మున్సిపాలిటీ లు, మున్సిపల్‌ కార్పొరేషన్లకు ప్రభుత్వం ఆదేశాలు జా రీ చేసింది. అవసరమైన అన్ని పనుల వివరాలతో నా లుగేండ్ల ప్రణాళిక రూపొందించాలని సూచించింది. అభివృద్ధి పనుల్లో వేగం ఉండేందుకు వీలుగా ఈ ముం దస్తు ప్రణాళికలు ఉండాలని పేర్కొంది. రాష్ట్ర ప్రభు త్వం ఇస్తున్న నిధులను ఖర్చు చేయడంలో కొన్ని ము న్సిపాలిటీల్లో జరుగుతున్న జాప్యంపై మున్సిపల్‌ శాఖ తాజాగా ఈ స్పష్టత ఇచ్చింది. నిధుల ఖర్చులో జాప్యం వల్ల అభివృద్ధి లక్ష్యం నెమ్మదిస్తోందని, ఇలాంటి వాటికి అవకాశం ఇవ్వవద్దని తెలిపింది. ముందస్తు ప్రణాళికతో ప్రభుత్వం విడుదల చేసే నిధుల ఖర్చులో జాప్యం ఉండొద్దని సూచించింది. పట్టణ ప్రగతి అమలు కోసం నాలుగేండ్ల ముందస్తు ప్రణాళికను రూపొందించాలని, దీనికి అనుగుణంగా రెండేండ్లలో చేపట్టే అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల మంజూరు కోసం పాలకవర్గాల అనుమతులు పొందాలని పేర్కొంది. 

పనుల ప్రాధాన్యంపై స్పష్టత

 ముందస్తు ప్రణాళికలో ఎలాంటి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపైనా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. పారిశుధ్య నిర్వహణకు  కావాల్సిన వాహనాల కొనుగోలు, వాటి మరమ్మతులు, డ్రైనేజీల్లో పూడికతీత వాహనాల కిరాయి చార్జీలు వివరాలను పొందుపరచాలని సూచించింది. హరితహారంలో భాగంగా చేపట్టే నర్సరీల ఏర్పాటు, పచ్చదనం పెంపు పనులు పేర్కొనాలని తెలిపింది. పబ్లిక్‌ టాయిలెట్లు, వైకుంఠధామాలు, శ్మశానవాటికలు, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్లు, ఓపెన్‌ జిమ్‌లు, ఆట స్థలాల నిర్మాణం.. వీధి వ్యాపారులు, తోపుడుబండ్లు, ఆటో, ట్యాక్సీల పార్కింగ్‌ కోసం ప్రత్యేక జోన్ల ఏర్పాటు పనులు ముందస్తు ప్రణాళికలో ఉండాలని పేర్కొంది. పట్టణ ప్రగతి పక్కా అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ.148 కోట్లు విడుదల చేస్తున్నది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని నగర, పురపాలక సంస్థలకు కలిపి రూ.36.07 కోట్లు ఇస్తున్నది. ఒక్క గ్రేటర్‌ వరంగల్‌కే ప్రతి నెలా రూ.7.35 కోట్లు విడుదల చేస్తున్నది. ఈ నిధులకు అదనంగా మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లకు సమకూరే నిధులుంటున్నాయి. అన్ని నిధులతో కలిపి పట్టణాల్లో వేగంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని మున్సిపల్‌ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు వరంగల్‌ ఉమ్మడి జిల్లాలోని గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌తోపాటు జనగామ, మహబూబాబాద్‌, భూపాలపల్లి, నర్సంపేట, పరకాల, తొర్రూరు, వర్ధన్నపేట, మరిపెడ, డోర్నకల్‌ మున్సిపాలిటీలు ముందస్తు ప్రణాళిక రూపకల్పనలో నిమగ్నమయ్యాయి.