సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలి

జిల్లా పశువైద్యాధికారి రవికుమార్
దామెర, డిసెంబర్ 2: గొర్రెలు, మేకల పెంపకందారులు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ జే రవికుమార్ అన్నారు. మండలకేంద్రంతోపాటు ల్యాదెళ్లలో గురువారం జీవాలకు నట్టల నివారణ మందు వేసి మాట్లాడారు. గొర్రెలు, మేకల్లో వచ్చే వ్యాధులను అరికట్టేందుకు ప్రభుత్వం ఉచితంగా మందులు అందిస్తూ పశుపోషకులకు బాసటగా నిలుస్తున్నదన్నారు. పెంపకందారులు సీజనల్ వ్యాధులపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు పశువైద్యాధికారుల సలహాలు, సూచనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ దీపిక, జడ్పీటీసీ కల్పన, సర్పంచ్‌లు కే శ్రావణ్య, వార్డు సభ్యుడు అమ్ముల దేవేందర్, శ్రీరాంరెడ్డి, వీఎల్వో లక్ష్మణ్, జేవీవో రవి, ఎల్ఎస్ఏ సిరాజొద్దీన్, అమ్ముల రాజుయాదవ్, సొనబోయిన కొమురయ్య పాల్గొన్నారు.
నర్సంపేట రూరల్: మండల పశువైద్యాధికారి ముద్దసాని శ్రీధర్‌రావు చంద్రయ్యపల్లి, రాజేశ్వర్రావుపల్లిలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు వేశారు. కార్యక్రమంలో ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘం అధ్యక్షుడు ఐలయ్య, పశువైద్య సిబ్బంది జయరాం, సత్యనారాయణ పాల్గొన్నారు.
దుగ్గొండి: మండలంలోని తిమ్మంపేట, బంధంపల్లి, నాచినపల్లిలో జీవాలకు నట్టల నివారణ మందు పంపిణీ చేశారు. దుగ్గొండి, తిమ్మంపేట, తొగర్రాయి పశువైద్యాధికారులు 19 వందల గొర్రెలు, 105 మేకలకు నట్టల నివారణ మాత్రలు వేశారు. దుగ్గొండి పశువైద్యాధికారి రామ్మోహన్, తిమ్మంపేట, బంధంపల్లి, నాచినపల్లి సర్పంచ్‌లు మోడెం విద్యాసాగర్‌గౌడ్, సునీత-రవి, పెండ్యాల మమత-రాజు, ఎంపీటీసీ ఎన్ మమత-మోహన్, వైద్యాధికారులు బాలాజీ, శారద పాల్గొన్నారు.
చెన్నారావుపేట: జడ్పీటీసీ బానోత్ పత్తినాయక్, అమీనాబాద్, పత్తినాయక్‌తండా, బోజేర్వు సర్పంచ్‌లు సిద్ధన రమేశ్, జాటోత్ స్వామినాయక్, పిండి విజయ-భిక్షపతి గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పశువైద్యాధికారి హరీశ్‌రెడ్డి, ఎంపీటీసీ కడారి సునీత, సాయిలు, గోపాలమిత్ర రమేశ్, సొసైటీ డైరెక్టర్ గడ్డల స్వరూప, మల్లయ్య, రాధారపు యాకయ్య, నూకల సాంబరాజు పాల్గొన్నారు.
గీసుగొండ: మనుగొండ, చంద్రయ్యపల్లి, అనంతారం, ఎలుకుర్తిలో జీవాలకు నట్టల నివారణ మందులను వైద్యాధికారులు వెంకన్న, రమేశ్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు నమిండ్ల రమ, స్రవంతి, మక్కెన అశ్విని, పూండ్రు జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
సంగెం: తిమ్మాపురంలో సర్పంచ్ గన్ను శారద-సంపత్, వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండల పశువైద్యాధికారి వీ రాజు, గన్ను సంపత్, గోపాలమిత్ర బాబు, రైతులు పాల్గొన్నారు.
రాయపర్తి: మహబూబ్‌నగర్, కొత్తూరు సర్పంచ్‌లు గాదే హేమలత, రవీందర్‌రెడ్డి, కందికట్ల స్వామి, ఎంపీటీసీలు చిక్కొండ రజిత-వీరస్వామి, కందికట్ల రాధమ్మ-రాజయ్య జీవాలకు నట్టల నివారణ మందు వేసే కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ అవకాశాన్ని గొర్రెలు, మేకల పెంపకందారులు వినియోగించుకోవాలని సూచించారు. రాయపర్తి, పెర్కవేడు పశు వైద్యాధికారులు వీరగోని శ్రుతి, సోమశేఖర్, సిబ్బంది గణేశ్, ఎల్లేశ్, లక్ష్మయ్య పాల్గొన్నారు.
నల్లబెల్లి: మండలంలోని లెంకపల్లి, మేడపల్లి పరిధి రాంపూర్‌లో జీవాలను నట్టల నివారణ మందును పశువైద్యాధికారులు సురేశ్, శ్రీనాథ్ పంపిణీ చేశారు. మండల పరిధిలోని రెండు పశువైద్య కేంద్రాల్లో 25 వందల జీవాలకు నట్టల నివారణ మందు వేసినట్లు తెలిపారు
తాజావార్తలు
- చదువులమ్మను చట్టసభకు పంపుదాం..
- మహిళా లోకం.. వాణీదేవి వైపే
- బాధ్యతాయుతంగా పనిచేయాలి
- సంక్షేమ పథకాలను వివరించాలి
- అన్నిపార్టీలు అక్కడే తిష్ట.. దూకుడుగా గులాబీ
- మీటర్లు తిరుగుతున్నయ్..
- నిత్యం పచ్చతోరణం
- జిల్లాలో గ్రోత్ మానిటరింగ్ డ్రైవ్ పూర్తి
- కాసులు కురిపిస్తున్న.. కార్గో సేవలు
- పని చేస్తున్న ఇంటికే కన్నం ..