గురువారం 28 జనవరి 2021
Warangal-city - Dec 01, 2020 , 01:56:10

మత్స్య కార్మికులకు ప్రభుత్వం పెద్దపీట

మత్స్య కార్మికులకు ప్రభుత్వం పెద్దపీట

  • ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లెబోయిన అశోక్‌, మత్స్య సహకార సంఘం ఉమ్మడి జిల్లాఅధ్యక్షుడుబుస్స మల్లేశం 

భీమదేవరపల్లి: మత్స్యకార్మికులకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లెబోయిన అశోక్‌, మత్స్య సహకార సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బుస్స మల్లేశం అన్నారు. మండలంలోని గట్లనర్సింగాపూర్‌ గ్రామంలో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మత్స్య కార్మికులకు కనీస ప్రాధాన్యం కూడా లేదన్నారు. సైకిళ్లు, వలలు పంపిణీ చేసేందుకు సైతం తగిన బడ్జెట్‌ కూడా అప్పటి ప్రభుత్వం కేటాయించలేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంఏర్పడ్డాక ముదిరాజ్‌ కులస్తులపై ప్రభు త్వం ప్రత్యేక శ్రద్ధ వహించిందని వెల్లడించారు. ప్రతి ఏటా చెరువుల్లో వందశాతం సబ్సిడీపై చేప పిల్లలను వదులుతున్నట్లు తెలిపా రు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 90 కోట్ల చేపపిల్లలను రూ.200కోట్ల వ్యయంతో చెరువుల్లో వదిలినట్లు పేర్కొన్నారు. చెరువుల్లో రవు, బొత్స, మెరిగె, బంగారుతీగ తదితర చేపలకు ఎక్కువగా వదిలినట్లు చెప్పారు. చేపలను అమ్ముకోడానికి ఫిష్‌ మార్కెట్లు, కార్మికులకు ద్విచక్రవాహనాలు,ట్రాలీలను సైతం సబ్సిడీపై అందిస్తున్నదన్నారు. రాష్ట్రంలో 13 శాతం జనాభా కలిగిన ముదిరాజ్‌ కులస్తులకు అన్ని రాజకీయ పార్టీలు ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. సమీకృత మత్స్య అభివృద్ది పథకాన్ని మరో పదేళ్లు కొనసాగించాలని ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు. ముదిరాజ్‌ మహాసభ హుస్నాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి సన్నిల్ల వెంకన్న, మండలాధ్యక్షుడు గోనెల సంపత్‌, గూళ్ల వెంకటయ్య తపాల్గొన్నారు. 

పెద్దమ్మతల్లి ఆలయ నిర్మాణానికి భూమి పూజ.. 

గట్లనర్సింగాపూర్‌ గ్రామంలోని కోదండరాముని చెరువు వద్ద సోమవారం పెద్దమ్మతల్లి ఆలయ నిర్మాణం కోసం భూమి పూజ జరిగింది. ఎంపీపీ జక్కుల అనిత, సర్పంచ్‌ ఎర్రబెల్లి చంద్రకళ, మాజీ ఎంపీపీ సంగ సంపత్‌, మత్స్య సహకార సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బుస్స మల్లేశం, ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లబోయిన అశోక్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో సర్పంచులు వేల్పుల రవి, యామ వెంకటరాములు, అర్కాల రాజు, గ్రామ అధ్యక్షుడు బోనగిరి సంపత్‌, నాయకులు నూనె సదానందం, కూన తిరుపతి, గూళ్ల సంపత్‌, గోనెల రాజయ్య, బొల్లి కనుకయ్య, కనుకయ్య పాల్గొన్నారు. 

తెలంగాణ టూరిజం చైర్మన్‌ శ్రీనివాస్‌కు సన్మానం

కాశీబుగ్గ, నవంబర్‌ 30 : తెలంగాణ టూరిజం చైర్మన్‌ ఉప్పుల శ్రీనివాస్‌ గుప్తాను టీఆర్‌ఎస్‌ నాయకులు శాలువాతో సత్కరించారు. చైర్మన్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ పాలకుర్తి సారంగపాణి, 12వ డివిజన్‌ అధ్యక్షుడు ముడుసు నరసింహ, కేతిరి రాజశేఖర్‌, గడ్డం చిన్నా, నునావత్‌ రాజ్‌కుమార్‌, పులిచేరు సురేశ్‌, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo