సోమవారం 18 జనవరి 2021
Warangal-city - Nov 30, 2020 , 01:55:12

కౌన్సిల్‌ హాల్‌ నిర్మాణ పనులను వేగవంతం చేయాలి

కౌన్సిల్‌ హాల్‌ నిర్మాణ పనులను వేగవంతం చేయాలి

  • మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు

వరంగల్‌, నవంబర్‌ 29 : గ్రేటర్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ఆవరణలో చేపట్టిన నూతన కౌన్సిల్‌ హాల్‌ నిర్మాణ పనులతో పాటు ముందు భాగంలో గాంధీ విగ్రహం, గ్రీనరీ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు అన్నారు. ఆదివారం ఆయన కౌన్సిల్‌ హాల్‌ నిర్మాణ పనులతో  పాటు గాంధీ విగ్రహం ఏర్పాటు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ నూతన కౌన్సిల్‌ హల్‌లో లిఫ్ట్‌ను త్వరగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ముందు భాగం సుందరీకరించాలని సూచించారు. గాంధీ విగ్రహానికి శాశ్వత ప్రాతిపదికన నిచ్చెన ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో మేయర్‌ సతీమణి హైమావతి, స్టాండింగ్‌ కౌన్సిల్‌ ఐత ప్రసాద్‌, దాచేపల్లి సీతారాం, అఖిల్‌ తదితరులు పాల్గొన్నారు.

కమ్యూనిటీహాల్‌ పనులు ప్రారంభం

ములుగురోడ్డులోని వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయంలో రూ.45లక్షల పట్టణప్రగతి నిధులతో చేపట్టిన కమ్యూనిటీ హాల్‌ నిర్మాణ పనులకు మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు- హైమావతి దంపతులు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు మేయర్‌ దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ కమ్యూనిటీ హాల్‌ను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు యెలగం లీలావతి, నాగమళ్ల ఝూన్సీ, ఆలయ కమిటీ చైర్మన్‌ సత్యనారాయణ, కార్యదర్శి అంచూరి శ్రీనివాస్‌, మార్కెట్‌ డైరెక్టర్‌  చకిలం రాజేశ్వర్‌, ఏఈ కార్తీక్‌రెడ్డి, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ విక్రమ్‌ తదితరులు పాల్గొన్నారు.