ఇక స్మార్ట్ బస్స్టేషన్లు..

- రూ.వంద కోట్ల స్మార్ట్ సిటీ నిధులు
- వరంగల్‌లో బస్ డిపో ఏర్పాటుకు స్థలాన్వేషణ
- ప్రతిపాదనలు చేయాలని కలెక్టర్ ఆదేశాలు
- క్షేత్రస్థాయిలో పరిశీలించిన గ్రేటర్ కమిషనర్
వరంగల్ : మహా నగరంలోని బస్ స్టేషన్ల పునరుద్ధరణ పై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా బస్ స్టేషన్లను స్మార్ట్ స్టేషన్లుగా తీర్చిదిద్దనున్నారు. రూ.100 కోట్ల నిధులతో గ్రేటర్ కార్పొరేషన్‌లోని బస్స్టేషన్లు అభివృద్ధి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నా రు. ప్రస్తుతం గ్రేటర్‌లోని మూడు బస్ స్టేషన్లను పునరుద్ధరించడంతోపాటు నగరం నలు దిక్కులా బస్ స్టేషన్లను ఏర్పాటు చేసేలా అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు కలెక్టరేట్లో కమిషనర్ సత్పతితో కలిసి ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. హన్మకొండ, వరంగల్ బస్ స్టేషన్లతో పాటు మరికొన్ని కొత్త బస్ స్టేషన్ల ఏర్పాటు, ప్రయాణికులకు కల్పించాల్సిన వసతులపై ఆర్టీసీ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న బస్స్టేషన్లను బలోపేతం చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. అవసరం మేరకు అదనంగా ప్లాట్ ఫాంలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించాలన్నారు. ప్రతి బస్ స్టేషన్లో విశ్రాంతి గదులు, వీఐపీ , గర్భిణులు, బాలింతల కోసం ప్రత్యేక గదులను ఏర్పాటు చేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నారు. సైకిల్ రైడింగ్‌ను ప్రోత్సహించేలా బస్ స్టేషన్లలో సైకిల్ పార్కింగ్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని చెప్పారు. హన్మకొండ చౌరస్తాలోని బస్‌స్టాప్ ప్రాంతంలో ఆర్టీసీ ప్లాజా ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ సమ స్య తలెత్తకుండా ప్లాజాకు వచ్చే వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ ఉండేలా ప్రతిపాదనలు రూపొందించాలన్నారు.
వరంగల్ బస్‌స్టేషన్‌ను పరిశీలించాలి
వరంగల్ బస్‌స్టేషన్ పురాతనమైనందున అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆర్టీసీ, ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వరంగల్ బస్ స్టేషన్ శిథిలావస్థకు చేరుకుందని, రెండు శాఖల అధికారులు పరిశీలించి పూర్తి స్థాయి నివేదిక అందజేయాలన్నారు. తక్షణమే చేపట్టాల్సిన పునరుద్ధరణ పనులు, అదనపు సౌకర్యాల కోసం ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. వరంగల్‌లో బస్ డిపో కోసం సుమారు 5 ఎకరాల స్థలం నగర సమీపంలో గుర్తించాలన్నారు. వరంగల్‌లో బస్ డిపో ఏర్పాటుకు కార్యాచరణ వేగవంతం చే యాలని సూచించారు. హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్ల మాదిరిగా వరంగల్‌లో బస్ స్టేషన్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నారు. సమీక్షలో బల్దియా ఎస్ ఈ విద్యాసాగర్, ఆర్టీసీ ఆర్ఎం శ్రీధర్, స్మార్ట్‌సిటీ ప్రాజెక్ట్ మేనేజర్ ఆనంద్, బీవీఎం శ్రీనివాస్, హన్మకొండ, వరంగల్ డిపో మేనేజర్ సురేశ్, మోహన్‌రావు పాల్గొన్నారు.
ఆర్టీసీ ప్లాజా స్థలం పరిశీలించిన కమిషనర్
హన్మకొండ చౌరస్తాలో నిర్మించనున్న ఆర్టీసీ ప్లాజా స్థలాన్ని ఆర్టీసీ, స్మార్ట్‌సిటీ అధికారులతో కలిసి గ్రేటర్ కమిషనర్ పమేల సత్పతి పరిశీలించారు. రాగన్న దర్వాజ వద్ద ఖాళీ స్థలంలో లూ లెవల్ పార్కింగ్ ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. వరంగల్ బస్ స్టేషన్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించి చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు చేయాలన్నారు.
తాజావార్తలు
- తెలంగాణ సూపర్
- ఈడబ్ల్యూఎస్ కోటాతో సమతూకం
- మేధోకు 2211 కోట్ల కాంట్రాక్టు
- 18 దేశాల్లో టిటా కమిటీలు
- టీజీటీఏ ప్రధాన కార్యదర్శిగా మల్లేశ్
- 25 నుంచి పీజీ ఈసెట్ స్పెషల్ కౌన్సెలింగ్
- ఆయుష్ పీజీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్
- 24, 25న ఈఎస్సీఐ ఎంబీఏలో స్పాట్ అడ్మిషన్లు
- గిరిజనుల ఆర్థికాభివృద్ధే ఐటీడీఏ లక్ష్యం
- ఓయూ దూరవిద్య డిగ్రీ ఫలితాలు