గురువారం 21 జనవరి 2021
Warangal-city - Nov 26, 2020 , 02:41:44

ఘనంగా హయగ్రీవాచారి జయంతి

ఘనంగా హయగ్రీవాచారి జయంతి

హన్మకొండ చౌరస్తా, నవంబర్‌ 25 : ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి, వరంగల్‌ పురపాలక సంఘం ప్రథమ అధ్యక్షుడు హయగ్రీవాచారి జయంతి నిర్వహించారు. హన్మకొండ జూనియర్‌ కళాశాల జంక్షన్‌లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో విగ్రహ కమిటీ అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్‌ రావుల సదానందం, మాజీ ఎమ్మెల్యే బోనగిరి ఆరోగ్యం, తుమ్మనపల్లి వీరన్న, వడ్నాల నగేశ్‌, పోశాల పద్మ, అందె గణేశ్‌బాబు, స్వాతంత్య్ర సమరయోధులు పాశికంటి వీరస్వామి, బిల్లా అడవయ్య, హన్మకొండ మల్లయ్య, కొమురయ్య, కడారి ఐలయ్య, వెంకట్‌రాంరెడ్డి, గుండు పెద్దన్న, వీ సాంబయ్య, వీ శ్రీనివాస్‌, ఆంజనేయులు, కొత్తూరు పద్మ, బీ రాజ్‌కుమార్‌, ఎర్ర రామకృష్ణ, కే ఉదయ్‌కిరణ్‌, యోగేశ్‌ తదితరులు పాల్గొన్నారు.logo