ఎంజీఎంలో ఆర్టీపీసీఆర్ నమూనా సేకరణ కేంద్రం

వరంగల్ చౌరస్తా, నవంబర్ 23 : వరంగల్ ఎంజీఎం దవాఖానలో మంగళవారం నుంచి ఆర్టీపీసీఆర్(రిజర్వ్ ట్రాన్స్‌స్క్రిప్షన్ పాలిమరైజ్ చైన్ రియాక్షన్) టెస్టులు చేయనున్నారు. ఈ మేరకు ఇక్కడ నమూనా సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం ఏర్పాట్లను అర్బన్ డీఎంహెచ్‌వో డాక్టర్ లలితాదేవి, ఎంజీఎం సూపరింటెండెంట్ నాగార్జునరెడ్డి పరిశీలించారు. హై కోర్టు ఉత్తర్వుల మేరకు కరోనా పరీక్షల సంఖ్య పెంచడానికి చర్యలు చేపట్టినట్లు వారు తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన ఆర్టీపీసీఆర్ టెస్ట్ నమూనా సేకరణ కేంద్రంలో వినియోగం తక్కువగా ఉన్నందున దాన్ని ఎంజీఎంకు తరలించడానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అలాగే, ఎంజీఎం దవాఖాన ఓపీ విభాగంలో ర్యాపిడ్ టెస్టులు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని సూచించారు కార్యక్రమంలో అడిషినల్ డీఎంహెచ్‌వో మదన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- అనంతగిరి కొండలను కాపాడుకుందాం..
- 'కుట్రతోనే రైతు సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ జాప్యం'
- హాఫ్ సెంచరీలతో చెలరేగిన శార్దూల్, సుందర్
- వాట్సాప్ కొత్త స్టేటస్ చూశారా?
- ఐస్‌క్రీమ్‌లో కరోనా వైరస్
- బ్రిస్బేన్ టెస్ట్‌లో శార్దూల్ ఠాకూర్ అరుదైన ఘనత
- కర్నాటకలో అభివృద్ధి పనులను ప్రారంభించనున్న అమిత్‌షా
- డెంటల్ సీట్ల భర్తీకి అదనపు కౌన్సెలింగ్
- పొగమంచు ఎఫెక్ట్.. 26 రైళ్లు ఆలస్యం..
- రాష్ట్రంలో కొత్తగా 299 కరోనా కేసులు