గురువారం 28 జనవరి 2021
Warangal-city - Nov 23, 2020 , 02:35:28

స్వరాష్ట్రంలో ప్రగతి పరుగులు

స్వరాష్ట్రంలో ప్రగతి పరుగులు

  • సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతో మారుతున్న రూపురేఖలు
  • కోట్లాది రూపాయలతో మౌలిక వసతులు
  • ఆహ్లాదం పంచేలా రూపుదిద్దుకున్న భద్రకాళి బండ్‌
  • పట్టణ ప్రకృతి వనాలతో నందనవనంలా నగరం
  • వెలుగులోకి వారసత్వ సంపద
  • ఔటర్‌రింగ్‌ రోడ్డుతో పారిశ్రామిక వృద్ధి
  • హైదరాబాద్‌ స్థాయిలో తీర్చిదిద్దుతున్న సర్కారు..

మెట్రోపాలిటన్‌ సిటీ తరహాలో స్మార్ట్‌ రోడ్లు..

వందల కోట్ల స్మార్ట్‌సిటీ నిధులతో నగరంలోని రోడ్లను అంతర్జాతీయ రోడ్ల తరహాలో నిర్మిస్తున్నారు. ఈమేరకు రూ.2700 కోట్లతో ప్రణాళికలు రూపొందించారు. ఇందులో పశ్చిమ నియోజకవర్గంలో నాలుగు ప్రధాన రహదారులు దాదాపు పూర్తికాగా తూర్పు నియోజకవర్గంలో 11 స్మార్ట్‌ రోడ్లకు సంబంధించి పనులు మొదలయ్యాయి. దీంతో ప్రధాన రహదారులన్నీ స్మార్ట్‌రోడ్లుగా మారనున్నాయి.

వరంగల్‌ : స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్‌ సర్కారు పాలనలో వరంగల్‌ నగరం అభివృద్ధిలో దూసుకుపోతోంది. హైదరాబాద్‌ స్థాయిలో తీర్చిదిద్దాలనే సీఎం కేసీఆర్‌, మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ సంకల్పంతో నగరాభివృద్ధి పరుగులు పెడుతోంది. ఈమేరకు రూ. వందల కోట్లు కేటాయిస్తూనే స్మార్ట్‌సిటీ, హృదయ్‌, అమృత్‌ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా నగరానికి కొత్తందాలు తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషిచేసింది. దీంతో ప్రధాన రహదారులు స్మార్ట్‌ రోడ్లు అవుతుండడంతో నగర రూపురేఖలు మారుతున్నాయి. అలాగే హృదయ్‌తో వారసత్వ నగరానికి పర్యాటక శోభ తీసుకొస్తున్నారు. దేశ, విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా కాకతీయ వారసత్వ సంపదకు కొత్తందాలు అద్దుతున్నారు. భద్రకాళి బండ్‌ సుందరీకరణతో నగర ప్రజలకు ఆహ్లాదాన్ని అందించనున్నారు. అమృత్‌ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథకు అనుసంధానం చేసి ఇంటింటికీ నల్లా కనెక్షన్‌ అందిస్తున్నారు. ప్రతి నెలా అందిస్తున్న పట్టణ ప్రగతి నిధులతో ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తున్నారు. బడ్జెట్‌లో 10శాతం గ్రీన్‌ బడ్జెట్‌కు కేటాయించి పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేస్తూ నగరాన్ని నందన వనంగా తీర్చిదిద్దుతున్నారు. నగరానికి మణిహరంగా ఔటర్‌ రింగ్‌ రోడ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టి పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిస్తోంది.సర్కారు చొరవతో ఇంటింటికీlogo