శనివారం 28 నవంబర్ 2020
Warangal-city - Nov 22, 2020 , 02:49:16

సవారీకి సైకిల్‌

సవారీకి సైకిల్‌

కొత్త జనరేషన్‌.. పాత ట్రెండ్‌

  • లాక్‌డౌన్‌ తర్వాత బాగా పెరిగిన కొనుగోళ్లు
  • బడులకు సెలవులతో ఎక్కువ డిమాండ్‌
  •  కొవిడ్‌ కారణంగా 8నెలలుగా ఇంట్లోనే పిల్లలు
  • స్కూలు, ఆటలు, ఎక్సర్‌సైజ్‌లు బంద్‌ 
  • సైకిల్‌తో ఒత్తిడిని జయిస్తున్న చిన్నారులు
  • 30 శాతం పుంజుకున్న అమ్మకాలు

దాదాపు రెండు, మూడు దశాబ్దాల క్రితం ఇంటికో సైకిల్‌ ఉంటే అదే గొప్ప.. పెళ్లిలో వరుడికి కట్నంగా సైకిల్‌నే పెట్టడం అప్పటి వారికి గుర్తుండే ఉంటుంది. పొద్దున లేచింది మొదలు ఏ పనికి వెళ్లాలన్నా సైకిలే దిక్కయ్యేది. రానురానూ కాలం మారింది. ఆర్థికంగా ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరి చేతిలో బైక్‌ ఉంటున్నది. కొద్దిగా ఆర్థిక పరిపుష్టి ఉన్నోళ్ల ఇంటి ముందు కారే దర్శనమిస్తున్నది. సుమారు దశాబ్దం నుంచి పల్లెల్లోనూ సై‘కిల్‌'అవుతూ వచ్చింది. ఇప్పుడు కరోనా కారణంగా మళ్లీ మార్పు మొదలైంది. కొత్త జనరేషన్‌ పాత ట్రెండ్‌ను ఫాలో అవుతున్నది. ఓ వైపు ఆరోగ్యం, మరోవైపు మానసికోల్లాసం కోసం చిన్నాపెద్దా తేడా లేకుండా ‘సై’ అంటూ సైకిల్‌ తొక్కుతుండడం కనిపిస్తున్నది. లాక్‌డౌన్‌ అనంతరం 30శాతం సైకిల్‌ అమ్మకాలు పెరుగడమే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నది. - వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ