శంషాబాద్, మే 15: జీఎంఆర్ హైదరాబాద్(శంషాబాద్) ఎయిర్కార్గోకు శనివారం అమెరికాలోని డల్లాస్ నుంచి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ రూపంలో కొవిడ్ రిలీఫ్ మెటీరియల్ చేరిందని జీఎంఆర్ కమ్యూనికేషన్ వర్గాలు తెలిపాయి. సుమారు 2352 కిలోల బరువు గల 8 ఆక్సీ కాన్సన్ట్రేటర్లు వచ్చాయని, కొవిడ్ ప్రారంభం నుంచి వ్యాక్సిన్లు, వైద్య పరికరాలు, పీపీఐ కిట్లు, మాస్క్లు, శానిటైజర్లు వంటివి ఎయిర్కార్గోకు వస్తున్నట్లు ప్రకటించారు.