గురువారం 28 జనవరి 2021
Warangal-city - Nov 11, 2020 , 02:30:10

డీసీసీబీలో వాహనాల వేలం

డీసీసీబీలో వాహనాల వేలం

వరంగల్‌ సబ్‌అర్బన్‌ : జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆధ్వర్యంలో గతంలో సీజ్‌ చేసి వాహనాలను మంగళవారం వేలం వేశారు. ఇంతకు ముందు రుణాలు తీసుకుని చెల్లించకుండా ఉన్న పలు రకాల వాహనాలను డీసీసీబీ అధికారులు సీజ్‌ చేశారు. నిర్ణీత గడువు పూర్తికావడంతో డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు ఆధ్వర్యంలో వేలం వేసేందుకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఈ క్రమంలో నక్కలగుట్టలోని ప్రధాన కార్యాలయంలో వేలం ప్రక్రియ నిర్వహించారు. బొలెరో వాహనాన్ని రూ.4,56,000తో సీహెచ్‌ రవీందర్‌ వేలంలో సొంతం చేసుకున్నారు. మరో బొలెరో వాహనం రూ.5,01,000కు అబ్దుల్‌జాఫర్‌, బొలేరో క్యాంపుర్‌ను రూ.4,33,000కు యూ ధనుంజయ, టొయోటో ఇటియోస్‌ ను రూ.4,71,000కు ఎన్‌ పాపారావు, టయోటా ఇటియోస్‌ను రూ. 4,36,000 ఎస్‌ రాంరెడ్డి దక్కించుకున్నారు. బ్యాంకు రూ.19,14,210కు అంచనా వేయగా రూ.22,97,000కు వేలం వేశారు. డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు, వైస్‌ ప్రెసిడెంట్‌ కే వెంకటేశ్వర్‌రెడ్డి, బ్యాంకు డైరెక్టర్‌ చాపల యాదగిరిరెడ్డి, పోలేపాక శ్రీనివాస్‌, బ్యాంకు సీఈవో చిన్నారావు, డీజీఎం అశోక్‌, ఏజీఎం మధు, స్రవంతి, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. 


logo