ఆదివారం 29 నవంబర్ 2020
Warangal-city - Nov 01, 2020 , 01:51:57

విలీన గ్రామాలకూ సాదాబైనామా

విలీన గ్రామాలకూ సాదాబైనామా

వరంగల్‌ ఉమ్మడి జిల్లా ముఖ్యుల విజ్ఞప్తికి వెంటనే అంగీకరించిన సీఎం 

వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రైతు వేదికను ప్రారంభించేందుకు కొడకండ్లకు వచ్చిన సీఎం కేసీఆర్‌ను మధ్యాహ్నం భోజన సమయంలో వరంగల్‌ ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్‌పర్సన్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్‌ చైర్మన్లు కలిశారు. గ్రేటర్‌ వరంగల్‌లో విలీన గ్రామాలకు సాదాబైనామా క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌, ఇతర ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేయగా ఆయన సానుకూలంగా స్పందించారు. దీనిపై ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. వరదలతో వరంగల్‌ నగరంలో మౌలిక వసతులు దెబ్బతిన్నాయని, పునరుద్ధరణ కోసం చర్యలు తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరగా ప్రతిపాదనలు రూపొందించాలని జిల్లా ముఖ్యులను సీఎం ఆదేశించారు. దేవాదుల ప్రా జెక్టు పరిధిలోని పనులు పూర్తి చేయాలని పలువురు ప్రజాప్రతినిధులు దృష్టికి తేగా ఉమ్మడి జి ల్లా ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాలని సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. విజ్ఞప్తులపై వెంటనే స్పందించిన సీఎంకు వరంగల్‌ ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.