బుధవారం 25 నవంబర్ 2020
Warangal-city - Oct 31, 2020 , 02:24:04

మహిళ వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం

మహిళ వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం

వరంగల్‌ చౌరస్తా, అక్టోబర్‌ 30 : పేద ఆర్యవైశ్య మహిళ వైద్య ఖర్చులకు వాసవీ క్లబ్‌ వరంగల్‌ విభాగం ప్రతినిధులు శుక్రవారం వాసవీ భవన్‌లో ఆర్థికసాయం అందించారు. అనారోగ్యంతో వెలగందుల సంధ్య ఐదు నెలలుగా బాధపడుతున్నది. వాసవీ క్లబ్‌ వరంగల్‌ ప్రతినిధులు, వాసవీ హెల్పింగ్‌ హ్యాండ్‌, గజానన ఫైనాన్స్‌ వారి సహకారంతో ఆర్యవైశ్య సంఘం పట్టణ ప్రధాన కార్యదర్శి, వాసవీ క్లబ్‌ వరంగల్‌ మాజీ అధ్యక్షుడు మాదారపు రాజేశ్వర్‌రావు చేతుల మీదుగా 37వేల రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి వాసవీ క్లబ్‌ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. కార్యక్రమంలో వాసవీ క్లబ్‌ వరంగల్‌ అధ్యక్షుడు వల్లాల పృథ్వీరాజ్‌, కార్యదర్శి తోట మార్కండేయ, గందె గోవిందరాజులు, చందా రఘువీర్‌, తొనుపునూరి అశోక్‌, పల్లెర్ల వీరన్న, కట్టమూరి త్రివిక్రమ్‌ తదితరులు పాల్గొన్నారు.