బుధవారం 20 జనవరి 2021
Warangal-city - Oct 31, 2020 , 02:22:46

గుట్టలు, వాగులు దాటి..

గుట్టలు, వాగులు దాటి..

20 కి.మీ కాలినడకన వెళ్లి సోలార్‌ప్లాంట్‌కు మరమ్మతులు

వాజేడు: మండలంలోని ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతంలో ఉన్న పెనుగోలు గ్రామానికి శుక్రవారం మెకానిక్‌లు మూడు గుట్టలు, మూడు వాగులు దాటి 20 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి సోలార్‌ ప్లాంట్‌కు మరమ్మతులు చేశారు. ములుగు జిల్లా కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య ఆదేశాలతో పేరూరు  పంచాయతీ  కార్యదర్శి ఉయిక రమేశ్‌తో కలసి వారు ఆ గ్రామానికి వెళ్లారు. గ్రామంలో మరమ్మతు లకు గురైన సోలార్‌ ప్లాంట్‌ గురించి తెలుసుకున్న కలెక్టర్‌ ఇటీవల మండలంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమస్యను పరిష్కరించేందుకు మె కానిక్‌లను పంపించారు. అక్కడికి వెళ్లి వాటిని పరిశీలించి, సోలార్‌ ప్లాంట్‌ సమస్యలపై కలెక్టర్‌కు వివరించేందుకు ఉదయం 7 కు వెళ్లి సాయంత్రం 6గంటలకు తిరిగి వచ్చారు. మరమ్మతులు నిర్వ హిస్తే ఆ గ్రామంలో కరంట్‌ సమస్య తీరనుంది. 


logo