శుక్రవారం 04 డిసెంబర్ 2020
Warangal-city - Oct 28, 2020 , 02:25:47

జంపన్నవాగులో మునిగి యువకుడి మృతి

జంపన్నవాగులో మునిగి యువకుడి మృతి

తాడ్వాయి : మేడారంలోని  వాగులో మునిగి ఓ యువకుడు మృతిచెందాడు. ఎస్‌ఐ వెం కటేశ్వర్‌రావు కథనం ప్రకారం.. సికింద్రాబాద్‌ అంబర్‌గూడకు చెందిన పెం బర్తి నరహరి యాదవ్‌ ఏటా తమ వీధిలో అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించి, నవరాత్రుల అనంతరం మేడారం జంపన్నవాగులో నిమజ్జనం చేస్తుంటాడు. ఈ క్రమంలోనే  కాలనీ వాసులతో కలిసి రెండు కార్లు, ఒక ట్రాలీ ఆటోలో సోమవారం రాత్రి మేడారానికి చేరుకున్నారు. మంగళవారం దుర్గమ్మ తల్లి విగ్రహాన్ని ఊరట్టం లోలెవల్‌ కాజవే వద్ద నిమజ్జనం చేశారు. అయితే, వీరితో పాటు వచ్చిన నాలం యశ్వంత్‌(17) స్నానం చేసేందుకు మళ్లీ వాగులోకి దిగాడు. అక్కడ లోతు ఎక్కువగా ఉండడం, ఈత రాకపోవడంతో యశ్వంత్‌ మునిగిపోయాడు. స్థానికుల సహకారంతో వాగులో రెండు గంటల పాటు గాలించగా యశ్వంత్‌ మృతదేహం కనిపించింది. అతడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాన్ని ఏటూరునాగారం దవాఖానకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.