మాడ్రిడ్ : ప్రతిష్ఠాత్మక మాడ్రిడ్ పోరులో అలెగ్జాండర్ జ్వెరెవ్ రెండో సారి టైటిల్‌ను గెల్చుకున్నాడు. మొదటి సెట్ కోల్పోయినప్పటికీ వరుసగా రెండు సెట్లలో ప్రపంచ నంబర్ 9 బరాటినిని ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.
ప్రపంచ నంబర్ 6 జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్.. మాటియో బరాటినిని ఓడించి మాడ్రిడ్ ఓపెన్ 2021 ను గెలుచుకున్నాడు. ఫైనల్లో జ్వెరెవ్ 6-7 (8), 6-4, 6-3 తేడాతో బరాటిపై విజయం సాధించాడు. అతను మొదటి సెట్‌ను టై బ్రేకర్‌తో కోల్పోయిన తర్వాత తిరిగి బౌన్స్ అయ్యాడు. తర్వాతి రెండు సెట్లను అలవోకగా గెలుచుకున్నాడు. ఇది జ్రెరెవ్కు రెండవ మాడ్రిడ్ ఓపెన్ టైటిల్. ఇప్పటి వరకు మొత్తం నాలుగో ఏటీపీ మాస్టర్స్ తోపాటు 1000 ట్రోఫీలను గెలుపొందాడు.
జ్వెరెవ్ ట్రోఫీ ప్రయాణంలో ముగ్గురు టాప్-10 స్టార్లను ఓడించాడు. ప్రపంచ నంబర్-3, 5 తోపాటు మాడ్రిడ్ ఓపెన్ ఛాంపియన్ రాఫెల్ నాదల్, 2 సార్లు రన్నరప్ డొమినిక్ థీమ్‌లను ఓడించడం విశేషం. జ్వెరెవ్ తన 24 సంవత్సరాల టెన్నీస్ ప్రయాణంలో ఒకే టోర్నమెంట్లో ముగ్గురు టాప్ -10 ఆటగాళ్లపై విజయంసాధించడం ఇది రెండవసారి.]
దక్షిణాఫ్రికా దేశాధ్యక్ష పీఠంపై నెల్సన్ మండేలా.. చరిత్రలో ఈరోజు
కేపీ ఒలి విశ్వాస పరీక్షకు అడ్డంకిగా కరోనా..!
వచ్చే నెల 1 నుంచి నిలిచిపోనున్న గూగుల్ ఉచిత సేవలు
అమెరికా ఆకాశంలో గుర్తుతెలియని వస్తువులు.. నిజానికి అవేంటంటే..!
రెమ్‌డెసివిర్ అమ్ముతూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన వైద్యుడు.. వీడియో వైరల్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..