శుక్రవారం 04 డిసెంబర్ 2020
Warangal-city - Oct 25, 2020 , 02:15:10

మైలారంలో బతుకమ్మ తల్లి విగ్రహావిష్కరణ

మైలారంలో బతుకమ్మ తల్లి విగ్రహావిష్కరణ

  • పాల్గొన్న మంత్రి  ఎర్రబెల్లి దయాకర్‌రావు

రాయపర్తి : సద్దుల బతుకమ్మ ఆడబిడ్డల ఆత్మీయతకు వేడుక అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం మండలంలోని మైలారం గ్రామంలోని మారెమ్మ కుంటలో గ్రామానికి చెందిన రావుల నర్సింహారెడ్డి సహకారంతో సర్పంచ్‌ లేతాకుల సుమతి నేతృత్వంలో ఏర్పాటు చేయించిన బతుకమ్మ తల్లి విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణ ప్రజల సంస్కృతీ సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమన్నారు. అక్కాచెల్లెండ్ల ప్రతిరూపాలే తీరొక్క పువ్వులన్నారు. గట్టికల్‌, పెర్కవేడు, కొత్తూరు గ్రామాల్లో బతుకమ్మలతో వస్తున్న మహిళలకు స్వాగతం పలికిన మంత్రి ఎర్రబెల్లి వారితో కలిసి బతుకమ్మ ఆడారు. ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్‌, జిల్లా నాయకుడు బిల్ల సుధీర్‌రెడ్డి, రైతుబంధు మండల కోఆర్డినేటర్‌ ఆకుల సురేందర్‌రావు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. 

మంత్రి స్వగృహంలో..

పర్వతగిరి : మండల కేంద్రంలోని మంత్రి స్వగృహంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు - ఉషా దంపతు లు కుటుంబసభ్యులతో కలిసి బతుకమ్మ పేర్చారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ మంత్రి దయాకర్‌రావుతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు.