సోమవారం 30 నవంబర్ 2020
Warangal-city - Oct 25, 2020 , 02:15:07

ఘనంగా సద్దుల బతుకమ్మ

ఘనంగా సద్దుల బతుకమ్మ

జిల్లాలో బతుకమ్మ వేడుకలు శనివారం అంబరాన్నంటాయి.  ఈ సందర్భంగా మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. సాయంత్రం సమయంలో ముఖ్య కూడళ్లు, ఆలయాల వద్దకు బతుకమ్మలను తీసుకెళ్లి ఆడిపాడారు. ఆడబిడ్డలు ఒకరికొకరు వాయినాలను ఇచ్చిపుచ్చుకున్నారు.  హన్మకొండలోని పద్మాక్షి ఆలయం, వరంగల్‌లోని ఉర్సు రంగలీల మైదానంలో వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆడారు.  అనంతరం సమీప చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేసి ఇళ్లకు వెళ్లారు.  ఈ సందర్భంగా ఎక్కడ చూసినా పూల సందడి నెలకొంది.