శుక్రవారం 04 డిసెంబర్ 2020
Warangal-city - Oct 23, 2020 , 02:44:14

విలీన గ్రామాల అభివృద్ధికి కృషి

విలీన గ్రామాల అభివృద్ధికి కృషి

  • వరంగల్‌ నగర మేయర్‌ ప్రకాశ్‌రావు  

 మడికొండ : విలీన గ్రామాల అభివృద్ధి కృషి చేస్తున్నట్లు వరంగల్‌ నగర మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు అన్నారు. 34వ డివిజన్‌ రాంపూర్‌ గ్రామంలో ముఖ్యమంత్రి హామీ నిధుల నుంచి రూ.55 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన బీటీ రోడ్డు పనులను గురువారం ఆయన స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్‌ జోరిక రమేశ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మేయర్‌ మాట్లాడుతూ రాంపూర్‌ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తామని హామీ ఇచ్చారు. రహదారి నిర్మాణం లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ గడువులోగా పనులను పూర్తి చేయాలని గుత్తేదారుకు సూచించారు. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ నగరానికి ముఖద్వారంగా ఉన్న రాంపూర్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని, అధిక నిధులు కేటాయించి గ్రామానికి నగర వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఈ దేవరకొండ నరేందర్‌, ఏఈ వెంకటేశ్వర్లు, నాయకులు అలువాల సురేశ్‌, రాంగోపాల్‌రావు, హనుమంతరావు, దేవేందర్‌, సదానందం, వెంకన్న, రవి, కుమార్‌, శ్రీనివాస్‌, కొమురయ్య, సునీల్‌, తిరుపతి, వినోద్‌, రాజు, నవీన్‌ పాల్గొన్నారు. 

 సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

హసన్‌పర్తి : గేటర్‌ వరంగల్‌ 54 డివిజన్‌ పరిధిలోని పరిమళకాలనీ, సప్తగిరి కాలనీలో రూ.50 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే అరూరి రమేశ్‌, మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు  శంకుస్థాపన చేశారు. కార్పొరేటర్‌ రాజునాయక్‌, టీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షుడు భూపాల్‌ గౌడ్‌, సాంబయ్యనాయక్‌, కర్ణాకర్‌ రెడ్డి, రమేశ్‌, యూత్‌ అధ్యక్షుడు అరుణ్‌, ఎస్సీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పోగుల రమేశ్‌, వీరునాయక్‌, సురేందర్‌ పాల్గొన్నారు.