శుక్రవారం 04 డిసెంబర్ 2020
Warangal-city - Oct 22, 2020 , 01:43:20

ఒకరి సస్పెన్షన్‌.. నలుగురి తొలగింపు

ఒకరి సస్పెన్షన్‌.. నలుగురి తొలగింపు

ఉత్తర్వులు జారీ చేసిన గ్రేటర్‌ కమిషనర్‌

వరంగల్‌, అక్టోబర్‌ 21: ధరణి విధులకు గైర్హాజరైన ఐదుగురు కార్పొరేషన్‌ ఉద్యోగులపై వేటు పడింది.  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియలో ప్రత్యేక డ్యూటీలు చేస్తున్న ఐదుగురు ఉద్యోగులు ఎలాంటి సమాచారం లేకుండా విధులకు డుమ్మా కొట్టారు. దీంతో వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎల్‌ సదానందాన్ని సస్పెండ్‌ చేస్తూ కమిషనర్‌ పమేలా సత్పతి బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, ఔట్‌ సోర్సింగ్‌ జవాన్లు ఎస్‌ రాజు, పీ శ్రీకాంత్‌, పారిశుధ్య కార్మికులు ఎస్‌ రాజేశ్‌, ఎస్‌ మహేందర్‌ను ఉద్యోగాల నుంచి తొలగించారు.