శుక్రవారం 04 డిసెంబర్ 2020
Warangal-city - Oct 21, 2020 , 01:56:29

గడువులోగా వేదికల నిర్మాణం పూర్తి చేయాలి

గడువులోగా వేదికల నిర్మాణం పూర్తి చేయాలి

  • కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు

హన్మకొండ, అక్టోబర్‌ 20 : జిల్లాలో గడువులోగా రైతు వేదికల నిర్మాణాలను పూర్తి చేయడంతో పాటు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు పీఆర్‌ ఇంజనీర్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో రైతు వేదికల నిర్మాణ పనుల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతు వేదికల నిర్మాణాల్లో నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలు తప్పని సరిగా పాటించాలన్నారు. లేని పక్షంలో సంబంధిత ఏఈ, ఏజెన్సీయే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. రైతు వేదిక నిర్మాణాలతోపాటు మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు. వేదికల ఆవరణలో మిగిలిన స్థలంలో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.  వేదికలో గోడలకు ఇరువైపులా రైతులకు సంబంధించిన పెయింటింగ్‌లు వేసేలా చర్యలు చేపట్టాలన్నారు.   సమావేశంలో పంచాయతీరాజ్‌ డిప్యూటీ ఇంజినీర్‌ శంకరయ్య, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. 

అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్‌ అమలు చేయాలి

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్‌ అమలు చేయడంతో పాటు రెడ్డి, వైశ్య కార్పొరేషన్లు ప్రకటించి, చట్టబద్ధ్దత కల్పించాలని ఓసీ జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతుకు వినతి పత్రం అందజేశారు.  ఈ నెల 12 నుంచి ప్రారంభించే ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో రిజర్వేషన్లు అమలు చేయాలని వారు వినితి పత్రంలో పేర్కొన్నారు. ఇచ్చిన వారిలో ఓసీ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపు జైపాల్‌రెడ్డి, గంగవరపు రామకృష్ణ ప్రసాద్‌, బోయినపల్లి  పాపారావు, వంగటి అశోక్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.