శుక్రవారం 04 డిసెంబర్ 2020
Warangal-city - Oct 21, 2020 , 01:56:29

కొనసాగుతున్న దేవీ నవరాత్రి ఉత్సవాలు

కొనసాగుతున్న దేవీ నవరాత్రి ఉత్సవాలు

నమస్తేతెలంగాణ నెట్‌వర్క్‌ : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. మండపాల్లో కొలువుదీరిన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐనవోలు మల్లికార్జునస్వామి దేవాయలంలోని భ్రమరాంబికాదేవి ‘కుష్మాండదుర్గ’ అలంకరణలో దర్శనమిచ్చారు. కొత్తకొండలోని వీరభద్రస్వామి ఆలయంలో భద్రకాళి అమ్మవారు శాకాంబరీ అలంకారంలో,  కాజీపేట శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయంతో పాటు  రైల్వే క్వార్టర్స్‌ శాంతినగర్‌ కాలనీలో అన్నపూర్ణా దేవిగా,  హసన్‌పర్తి మండలంలోని మార్కండేయ ఆలయంలో అన్నపూర్ణ మాతగా, వేలేరు మండలంలోని సోడషపల్లి గ్రామంలో అన్నపూర్ణదేవిగా,  వరంగల్‌ శ్రీనివాస కాలనీలోని శ్రీ శృంగేరి శంకరమఠంలో శ్రీ శారదాంబ అమ్మవారు వైష్ణవీమాతగా, ములుగు రోడ్డులోని శ్రీ వాసవీమాత ఆలయంలో గాయత్రీ మాతగా, ఎంజీఎం దవాఖాన సమీపంలోని శ్రీరాజరాజేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారు త్రిమూర్తి అలంకరణలో  దర్శనమిచ్చారు. కాగా, కాశీబుగ్గ ప్రాంతంలో డాక్టర్‌ హరిరమాదేవి దవాఖాన వద్ద కేటీఆర్‌ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఏపీ శ్రీను ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.