శుక్రవారం 04 డిసెంబర్ 2020
Warangal-city - Oct 21, 2020 , 01:56:29

పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి

పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి

ధర్మసాగర్‌,అక్టోబర్‌ 20: అర్హులైన పట్టభద్రులు ఎమ్మె ల్సీ ఎన్నికల్లో తమ పేరును నమోదు చేసుకోవాలని మాజీ జడ్పీ చైర్మన్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి సాంబారి సమ్మారావు సూచించారు. మం డల టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ,  టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థిని గెలిపించే విధంగా కృషి చేయాలని కోరారు. టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు సోంపల్లి కరుణాకర్‌, ప్రధాన కార్యదర్శి బేరే హరీశ్‌, వైస్‌ఎంపీపీ బండారి రవీందర్‌, బోడ్డు ప్రభుదాసు, జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యురాలు జుభేదాలాల్‌ మహ్మద్‌, వీరన్న పాల్గొన్నారు.   

రెడ్డికాలనీ, అక్టోబర్‌ 20: పట్టభద్రుల ఓటరు నమోదు లో భాగంగా డిప్యూటీ మేయర్‌ సిరాజుద్దీన్‌ ఆధ్వర్యంలో 41వ డివిజన్‌ ఓంసాయికాలనీ, బదర్‌మసీద్‌ తదితర కాలనీల్లో ఓటరు నమోదు చేయించారు. ఈ కార్యక్రమంలో 41వ డివిజన్‌ ఎమ్మెల్సీ  ఎన్నికల కోఆర్డినేటర్‌ తాళ్లపల్లి జనార్దన్‌ గౌడ్‌, 41వ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు పానుగంటి శ్రీధర్‌, 41వ డివిజన్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి సిరి మల్లె సదానందం, టీఆర్‌ఎస్‌ నాయకులు సిద్ధంశెట్టి శ్రీనివాస్‌, దేవులపల్లి ప్రదీప్‌, శీలం ప్రవీణ్‌, కేదరి మధుసూదన్‌, శ్రవణ్‌, రాజు, పట్టభద్రులు పాల్గొన్నారు. 

 కరీమాబాద్‌ : ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ నాయకత్వంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని కార్పొరేటర్‌ కత్తెర శాల వేణుగోపాల్‌ కోరారు. 23వ డివిజన్‌ ఎస్‌ఆర్‌ఆర్‌తోట లోఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టారు.  ఈ కార్యక్రమంలో కుడా అడ్వైజరీ మెంబర్‌ మో డెం ప్రవీణ్‌, బొల్లం రాజు, దోరం ఆనంద్‌, కొండ రాజు, బైరి ప్రతాప్‌, ఆడెపు భిక్షపతి తదితరులున్నారు. 

మట్టెవాడ: వరంగల్‌ నగరంలోని 24వ డివిజన్‌లో పట్టభద్రుల ఓటర్ల నమోదు కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతుంది. డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ శ్రేణులు బూత్‌ల వారీగా ఇంటింటికీ తిరుగుతూ పట్టభద్రుల వివరాలను సేకరిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు కొడకండ్ల సదాంత్‌, పూజా రి కుమారస్వామి, నాగరాజు, రుద్ర శ్రీనివాస్‌, ముఖేశ్‌, రాజు, ఓరుగంటి క్రాంతి పాల్గొన్నారు. 

న్యూశాయంపేట: 37వ డివిజన్‌ నూతన పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, డివిజన్‌ ఇన్‌చార్జి సుందర్‌రాజు ఆధ్వర్యంలో ఓటర్‌ నమోదు చేయించారు. డివిజన్‌ టీఆర్‌ఎస్‌ ఆధ్యక్షుడు ఎంఏ సమద్‌, టీఆర్‌ఎస్‌ మాజీ ఆధ్యక్షుడు రాజ్‌కుమార్‌, హమ్మద్‌, బషీర్‌, వెంకట్‌, అజీమ్‌, షఫీ ఉన్నారు. 

పోచమ్మమైదాన్‌: స్థానిక కార్పోరేటర్‌ శారదా సురేశ్‌ జోషీ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ కార్యాలయం లో పలువురు పట్టభద్రుల ఓటర్లను నమోదు చేసుకున్నారు.  నాయకులు జన్ను అనిల్‌కుమార్‌, కొత్తూరి యా కేందర్‌, ఎజాజ్‌, బాబా, కలకోట్ల కిరణ్‌ పాల్గొన్నారు.