గురువారం 28 జనవరి 2021
Warangal-city - Oct 21, 2020 , 01:56:29

65 రోజుల్లోనే రైతు వేదిక నిర్మాణం

65 రోజుల్లోనే రైతు వేదిక నిర్మాణం

  • సర్పంచ్‌ శ్రీనివాస్‌ను అభినందించిన అధికారులు

మరిపెడ: 65 రోజుల్లోనే ఎల్లంపేట రైతు వేదిక నిర్మాణం పూర్తయ్యింది. ఆగస్టు 4వ తేదీన డోర్నకల్‌ ఎమ్మెల్యే రెడ్యా వేదిక పనులకు శంకుస్థాపన చేశారు. అక్టోబర్‌ 9 వరకు పనులన్నీ పూర్తయి రైతు వేదికను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ పనులు చేపట్టిన ఆ గ్రామ సర్పంచ్‌ తాళ్లపెల్లి శ్రీనివాస్‌ను జిల్లా అధికారులు ప్రశంసిస్తున్నారు. వెల్‌ డన్‌ శ్రీనివాస్‌ అంటూ అభినందనలు తెలుపుతున్నారు. సీఎం కేసీఆర్‌ రైతు సంక్షేమానికి చేస్తున్న కృషిలో భాగంగా ప్రతి వ్యవసాయ క్లస్టర్‌కు ఓ రైతు వేదిక ఉండాలని తలిచి వాటి నిర్మాణానికి రూ. 22లక్షలు మంజూరు చేశారు. రైతులు తమ వ్యవసాయ పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర, పంటల సస్యరక్షణ చర్యలు, ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ పథకాలను తెలుసుకోవడానికి ఈ రైతు వేదికలు ఎంతో ఉపయోగపడనున్నా యి. జిల్లా కలెక్టర్‌ రైతు వేదికలను దసరా వరకు పూర్తి చేయాలని విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఈ క్ర మంలో ఎల్లంపేట సర్పంచ్‌ చాలెంజ్‌గా తీసుకోని 65రోజుల్లోనే రైతు వేదికను పూర్తి చేయడంతో గ్రామ రైతులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


logo