ఆదివారం 25 అక్టోబర్ 2020
Warangal-city - Oct 19, 2020 , 05:20:02

ప్రజలు టీఆర్‌ఎస్‌ వైపే..

ప్రజలు టీఆర్‌ఎస్‌ వైపే..

  • నేతలు అందుబాటులో ఉండాలి
  • కష్టకాలంలో ఆదుకోవాలి
  • తూర్పు ఎమ్మెల్యే నరేందర్‌ కష్టపడి పనిచేస్తున్నారు
  • హైదరాబాద్‌ స్థాయిలో వరంగల్‌ అభివృద్ధి
  • నగర ముంపు నివారణకు ప్రత్యేక ప్రణాళికలు
  • రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

వరంగల్‌, అక్టోబర్‌ 18 : ‘రాబోయే గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో వన్‌సైడ్‌గా గెలువబోతున్నాం. సర్వేలు అదే చెబుతున్నాయి. ప్రజలు టీఆర్‌ఎస్‌ వైపే ఉన్నారు. నేతలు ప్రస్తుత కష్టకాలంలో ప్రజల మధ్యలో ఉండాలి. కరోనా పేషెంట్లను ఆదుకోవాలి’ అని రాష్ట్ర పంచాయతీరా జ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం ఓ సిటీలో తూర్పు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం భూమి పూజ కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ.. గతంలో ఎమ్మెల్యేలు ఎక్కడ ఉంటారో తెలిసేది కాదని,  సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గానికి క్యాంపు కార్యాలయం నిర్మించాలని నిర్ణయించారన్నారు. సీఎం ఆలోచనను స్ఫూర్తిగా తీసుకుని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయన్నారు. గత ఎమ్మెల్యే నిర్వాకంతో తూర్పులో క్యాంపు కార్యాలయం ని ర్మించడంలో ఆలస్యం జరిగిందన్నారు. ప్రజలకు కేరాఫ్‌ అడ్రస్‌గా క్యాంపు కార్యాలయం ఉండాలన్నారు. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌కు మంచి భవిష్యత్‌ ఉందన్నారు. నిరంతరం ప్రజల కోసం ఆలోచించే నాయకుడన్నారు. తాను భూమి పూజ చేసిన ప్రతి చోట ఎమ్మెల్యేలు భారీ మెజారిటీతో గెలిచారని, రాబోయే ఎన్నికల్లో  నరేందర్‌ గెలుస్తారన్నారు. రైల్వేస్టేషన్‌కు పక్కనున్న ఇండియన్‌ ఆ యిల్‌ కార్పొరేషన్‌ను తరలించాలని సీఎం ఆదేశించారని, కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలన్నారు.

ముంపు నివారణకు పక్కా ప్రణాళికలు..

నగరంలోని భద్రకాళి, నయీంనగర్‌, బొందివాగు నాలా విస్తరణతో పాటు భవిష్యత్‌లో నగ రం ముంపునకు గురికాకుండా శాశ్వత పరిష్కా రం దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. వరంగల్‌ను హైదరాబాద్‌ స్థాయిలో అభివృద్ధి చే స్తామన్నారు. ఆరు నెలల్లో నగర రూపురేఖలు మా రుస్తామన్నారు. తూర్పు ఎమ్మెల్యే  నన్నపునేని న రేందర్‌ మాట్లాడుతూ.. సుదీర్ఘ రాజకీయ అనుభ వం ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చేతుల మీదుగా క్యాంపు కార్యాలయానికి భూమి పూజ జరుగడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. క్యాం పు కార్యాలయం ప్రజల ఆస్తి అన్నారు. అనంతరం ఎమ్మెల్యే అతిథులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. అంతకుముందు వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు చేతుల మీదుగా ఎమ్మె ల్యే నన్నపునేని నరేందర్‌ -వాణి దంపతులు క్యాంపు కార్యాలయం నిర్మాణానికి భూమి  పూజ నిర్వహించారు. కార్యక్రమంలో మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌, రాష్ట్ర మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్‌పర్సన్‌ గుండు సుధారాణి, కుడా చైర్మన్‌ మర్రి యా దవరెడ్డి, రైతు రుణ విమోచన కార్పొరేషన్‌ చైర్మన్‌ నాగుర్ల వెంకటేశ్వర్లు, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మం తు, కమిషనర్‌ పమేలా సత్పతి, కార్పొరేటర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.


logo