శుక్రవారం 30 అక్టోబర్ 2020
Warangal-city - Oct 18, 2020 , 04:33:50

తల్లీ శరణు.. శరణు

తల్లీ శరణు.. శరణు

  •  శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం
  • బాలాత్రిపుర సుందరిగా భద్రకాళి అమ్మవారు
  •  వేయిస్తంభాల గుడిలో రుద్రేశ్వరీదేవికి  పంచామృతాభిషేకం
  • కాళేశ్వరంలో శైలపుత్రి అవతారంలో పార్వతి, మహా సరస్వతి

వరంగల్‌ కల్చరల్‌, అక్టోబర్‌ 17 : చారిత్రక భద్రకాళి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యా యి. శనివారం తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అ నంతరం ఆలయ ఈవో సునీత జ్యోతి ప్రజ్వలన చేసి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. ఈవో, ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, సిబ్బంది 11.5 కిలోల బంగారు ఆభరణాలను భద్రకాళి అమ్మవారికి అలంకరించారు. అమ్మవారు శనివారం బాలాత్రిపు ర సుందరిమాతగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని ఉదయం వృషభ వాహనంలో, సాయంకాలం మృగ(జింక)వాహనంలో ఊ రేగించారు. ఉత్సవాలకు కుందూరు అనిల్‌రె డ్డి, అనిత దంపతులు ఉభయదాతలుగా వ్య వహరించారు. కార్యక్రమంలో కుడా చైర్మన్‌ మర్రియాదవరెడ్డి, కార్పొరేటర్‌ వేముల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

పద్మాక్షి దేవాలయంలో..

హన్మకొండ హనుమద్గిరి పద్మాక్షి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను శ్రీ గోవిందానంద స్వామి ప్రారంభించగా గ్రేటర్‌ కమిషనర్‌ పమేలా సత్పతి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం దేవస్థాన అనువంశిక ధర్మకర్త నాగిళ్ల శంకర్‌శర్మ, వేదపండితుడు నాగిళ్ల షణ్ముఖ పద్మనాభ అవధాని ఆధ్వర్యం లో దేవాలయంలో గోపూజ, గురువందనం, గణపతి పూజ, పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ఠ, చండీ సప్తశతి హవనం, హోమ కార్యక్రమాలు నిర్వహించారు. హన్మకొండ ఏసీపీ జితేందర్‌రెడ్డి, మైనార్టీ అధ్యక్షుడు నయీముద్దీన్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు కనుకుంట్ల రవికుమార్‌, పద్మాక్షి చారిటబుల్‌ ట్రస్టు, భక్తమండలి పరపతి సం ఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

సిద్ధేశ్వరాలయంలో...

సిద్ధేశ్వరాలయంలో భవానీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి అభిషేకం నిర్వహించారు. అమ్మవారికి నూతన వస్త్ర అలంకరణ చేసి స హస్రనామ కుంకుమ అర్చన చేశారు. ఆలయార్చకులు సిద్ధేశుని రవికుమార్‌, సురేశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

వేయి స్తంభాల ఆలయంలో..

రెడ్డికాలనీ : వేయిస్తంభాల దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 5 గంటల నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించి రుద్రేశ్వరీదేవికి పంచామృతాభిషేకం అనంతరం ప్రతిష్ఠించినట్లు ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. అమ్మవారిని శనివారం బాలాత్రిపుర సుందరిగా అలంకరించి చతుషష్ఠి ఉపచార పూజలు నిర్వహించి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. ఉత్సవాలను కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, స్థానిక కార్పొరేటర్‌ వేముల శ్రీనివాస్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పూజా కార్యక్రమంలో విగ్రహ దాత పల్లం రమేశ్‌-రాధిక దంపతులు, నర్సింగ్‌లాల్‌ దంపతులు, ఉత్సవ సమితి సభ్యులు ఎంఎస్‌కే బాబ్జీ, కోన శ్రీధర్‌, పులి రజినీకాంత్‌, మాడిశెట్టి రాజు పాల్గొని భక్తులకు సేవలందించారు. 9 రోజుల పాటు రుద్రేశ్వరీ దేవికి అలంకారాలు, నిత్యచండీ హోమం నిర్వహిస్తామని గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. కుడా చైర్మన్‌ మాట్లాడుతూ.. దేవాలయం వద్ద పూజా సామగ్రి అమ్ముకునే హక్కు  ‘కుడా’ నుంచి విడదీసి దేవాదాయశాఖకే ఇస్తామని తెలిపారు. 

రుద్రేశ్వరుడి సన్నిధి నుంచి

భద్రకాళి అమ్మవారికి..

భద్రకాళి దేవస్థానానికి సీఎం కేసీఆర్‌ 11 కిలోల బంగారు ఆభరణాలు అందించారు. ప్రతి సంవత్సరం రుద్రేశ్వరునికి సమర్పించి భద్రకాళి అమ్మవారికి అలంకరిస్తారు. ఆంధ్రాబ్యాంకు నుంచి శోభాయాత్ర ద్వారా ఆభరణాలను మొదల రుద్రేశ్వరుని సన్నిధికి అక్కడి నుంచి భద్రకాళి దేవాలయానికి తీసుకెళ్లారు. భద్రకాళి ఆలయ ఈవో ఆర్‌ సునీత, భద్రకాళి శేషు, టీఆర్‌ఎస్‌ నాయకులు మూల పరశురాములు, జగన్‌ తదితరులు పాల్గొన్నారు. 

శైలపుత్రి అలంకరణలో..

కాళేశ్వరం : శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి ఆలయంలోని పార్వతి, మహాసరస్వతి అమ్మవారి ఆలయాల్లో దేవీ నవరాత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పార్వతి, మహాసరస్వతి అమ్మవార్లు శైలపుత్రి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సీఎం కేసీఆర్‌ బహూకరించిన బంగారు కిరీటాన్ని ఆలయ ఈవో మారుతి ఆధ్వర్యంలో అర్చకులు అమ్మవారికి అలంకరించారు. పూజల్లో చైర్మన్‌ రాంనారాయణ గౌడ్‌, ఎంపీటీసీ మమత, సర్పంచ్‌ వసంత, సింగిల్‌ విండో చైర్మన్‌ తిరుపతి రెడ్డి, ధర్మకర్తలు ఓగేశ్‌, కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.