గురువారం 22 అక్టోబర్ 2020
Warangal-city - Oct 17, 2020 , 02:02:06

సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

  • జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి
  • గ్రామాల్లో బతుకమ్మ చీరెల పంపిణీ

శాయంపేట: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని, ఆడబిడ్డలు ఆనందంగా ఉండాలన్నదే టీఆర్‌ఎస్‌ సర్కారు ధ్యేయమని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి అన్నారు. మండలంలోని సాధన్‌పల్లి, రాజుపల్లి, గంగిరేణిగూడెం, సూర్యనాయక్‌తండా, కొప్పులలో శుక్రవారం ఆమె బతుకమ్మ చీరెలు పంపిణీ చేసి మాట్లాడారు. పూలను పూజించే సంస్కృతి ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు. అనంతరం సూర్యనాయక్‌తండాలో ఇటీవల అజ్మీరా కౌసల్య మృతి చెందగా, ఆమె కుటుంబ సభ్యులను జ్యోతి పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, ఎంపీడీవో అమంచ కృష్ణమూర్తి, పీఏసీఎస్‌ చైర్మన్‌ కుసుమ శరత్‌, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్‌ ఆదిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గంగుల మనోహర్‌రెడ్డి, సర్పంచ్‌ గోలి మాధురి, ఎంపీటీసీ మేకల శ్రీనివాస్‌, నాయకులు గోలి మహేందర్‌రెడ్డి, సామల మధుసూదన్‌, ఉప సర్పంచ్‌ అట్ల తిరుపతి, గుర్రం రవీందర్‌, కుమ్మరి కుమారస్వామి, వార్డు సభ్యులు గుర్రం సుధాకర్‌, మామిడి భద్రయ్య, మామిడి శోభాశంకర్‌, గండి సునీతా రాజు, పెండ్యాల సారంగపాణి, బండ హైమాప్రభాకర్‌, వంగాల శిరీష-భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. మండలంలోని గట్లకానిపర్తిలో సర్పంచ్‌ బొమ్మకంటి సాంబయ్య, ఎంపీటీసీ బత్తిని రజిని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి చీరెలు పంపిణీ చేశారు.

చీరెలు పంపిణీ చేసిన ప్రజాప్రతినిధులు

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: బతుకమ్మ చీరెల పంపిణీ ఊరూరా కొనసాగుతున్నది. నర్సంపేట మండలంలోని మహేశ్వరంలో ఎంపీపీ మోతె కళావతి  చీరెల పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్‌ మాడ్గుల కవిత, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. చెన్నారావుపేట మండలంలోని శంకరంతండా, లింగగిరి, బోజేర్వు, గొల్లపల్లె, పుల్లయ్యబోడుతండా, ఖాదర్‌పేట, చెరువుకొమ్ముతండాలో ఎంపీపీ బదావత్‌ విజేందర్‌ ఆయా గ్రామాల సర్పంచ్‌లతో కలిసి చీరెలు పంపిణీ చేశారు. వర్ధన్నపేట మండలంలోని ల్యాబర్తి, కొత్తపల్లిలో ఎంపీపీ అప్పారావు, జడ్పీటీసీ భిక్షపతి మహిళలకు చీరెలు అందించారు. ఖానాపురం మండలంలోని మంగళవారిపేటలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు సర్పంచ్‌తో కలిసి బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పర్వతగిరి మండలంలోని కొంకపాకలో చౌటపల్లి పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ తక్కళ్లపల్లి మధుసూదన్‌రావు సర్పంచ్‌ల ఆధ్వర్యంలో చీరెలు పంపిణీ చేశారు. సంగెం మండలంలోని మొండ్రాయిలో సర్పంచ్‌ గూడ కుమారస్వామి, ఎంపీటీసీ కొనకటి రాణి బతుకమ్మ చీరెల పంపిణీ చేశారు. గీసుగొండ మండలం ధర్మారంలో కార్పొరేటర్‌ లింగం మౌనిక చీరెలు పంపిణీ చేశారు. రాయపర్తి మండలంలోని పలు గ్రామాల్లో సర్పంచ్‌లు కోదాటి దయాకర్‌రావు, చెడుపాక కుమారస్వామి మహిళలకు చీరెలు అందించారు.


logo