శనివారం 31 అక్టోబర్ 2020
Warangal-city - Oct 17, 2020 , 02:02:03

‘నాన్‌ అగ్రికల్చర్‌ ప్రాపర్టీ’ని విజయవంతం చేయాలి

‘నాన్‌ అగ్రికల్చర్‌ ప్రాపర్టీ’ని విజయవంతం చేయాలి

కలెక్టరేట్‌: మున్సిపాలిటీల్లో నాన్‌ అగ్రికల్చర్‌ ప్రాపర్టీ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ ఆర్‌ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌ నుంచి టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా మున్సిపల్‌ కమిషనర్లతో మాట్లాడారు. పట్టణాల్లో భవన నిర్మాణాల నమోదును  వేగంగా జరుపాలని సూచించారు. నాన్‌ అగ్రికల్చర్‌ ప్రాపర్టీ నమోదు వర్ధన్నపేటలో 84 శాతం, నర్సంపేటలో 76 శాతం, పరకాలలో 78 శాతం పూర్తయిందని కమిషనర్లు అదనపు కలెక్టర్‌కు తెలిపారు. మున్సిపాలిటీల్లో మరుగుదొడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, నర్సరీల ఏర్పాటుతో పాటు పనులను ఎప్పటికప్పుడు పరిశీలించి నివేదికలు అందజేయాలన్నారు. బతుకమ్మ ప్రాంగణాలను శుభ్రం చేయాలన్నారు.