గురువారం 22 అక్టోబర్ 2020
Warangal-city - Oct 17, 2020 , 01:57:40

పండుగకు అదనపు బస్సు సర్వీసులు

పండుగకు అదనపు బస్సు సర్వీసులు

రెడ్డికాలనీ, అక్టోబర్‌ 16 : హన్మకొండ బస్‌స్టేషన్‌లో దసరా పండుగ సందడి నెలకొంది. ఆర్టీసీ అధికారులు పండుగ దృష్ట్యా అదనపు బస్సు సర్వీసులను ప్రారంభించారు. గురువారం నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక బస్సులు నడిపారు. వరంగల్‌ రీజియన్‌ పరిధిలోని హన్మకొండ బస్‌స్టేషన్‌, వరంగల్‌-1, వరంగల్‌-2 పరకాల, నర్సంపేట, జనగాం, తొర్రూరు, మహబూబాబాద్‌, భూపాలపల్లి నుంచి ప్రత్యేకంగా బస్సులు వేశారు. శుక్రవారం హన్మకొండ బస్‌స్టేషన్‌ ప్రయాణికులతో రద్దీగా మారింది. హైదరాబాద్‌, కరీంనగర్‌, భూపాలపల్లి, ఏటూరునాగారం, ఖమ్మం, నర్సంపేట, పాలకుర్తి, సిద్దిపేట, ఇతర దూరప్రాంతాల రూట్లలో ప్రయాణికుల తాకిడి పెరిగింది. కాగా, వర్షాల కారణంగా హైదరాబాద్‌ వైపు నడిపించిన బస్సుల్లో ప్రయాణికుల రద్దీ కనిపించలేదు. సొంతూరుకు వెళ్లే ప్రజలు వర్షం కారణంగా అక్కడే ఉండిపోయినట్లు తెలుస్తోంది. గురువారం వివిధ డిపోల నుంచి మొత్తం 40 అదనంగా బస్సులను నడిపింది. హైదరాబాద్‌ ఉప్పల్‌ క్రాస్‌రోడ్‌ వరకు ప్రత్యేకంగా బస్సులు వేశారు. అలాగే శుక్రవారం రీజియన్‌ పరిధిలో 80 బస్సులను అదనంగా నడిపారు.  

హైదరాబాద్‌కు ప్రత్యేక బస్సులు..: - అంచూరి శ్రీధర్‌, ఆర్‌ఎం

దసరా పండుగ సందర్భంగా గురువారం నుంచి ప్రత్యేక సర్వీసులను ప్రారంభించాం. వివిధ డిపోల నుంచి హైదరాబాద్‌కు మొదటిరోజు 40, శుక్రవారం 80 బస్సులు నడిపాం. హైదరాబాద్‌లో భారీ వర్షాల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ కనిపించడం లేదు. రద్దీ ఉన్న రూట్లలో అదనపు సర్వీసులు తిప్పుతాం. కరోనా వైరస్‌ కారణంగా ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లడం లేదు. logo