మంగళవారం 20 అక్టోబర్ 2020
Warangal-city - Oct 17, 2020 , 01:38:06

ఘనంగా ‘బియాబానీ’ ఉర్సు

ఘనంగా ‘బియాబానీ’ ఉర్సు

  • కొవిడ్‌ కారణంగా నిరాడంబరంగా ముగిసిన ఉత్సవాలు
  • పీఠాధిపతి ఖుస్రూపాషా ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు
  • గగుర్పొడిచేలా ఫకీర్ల విన్యాసాలు

కాజీపేట, అక్టోబర్‌ 16 :  దర్గా కాజీపేటలోని హజ్రత్‌షా అఫ్జల్‌ బియాబానీ దర్గాలో మూడు రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలు శుక్రవారం సాయం త్రం నిరాడంబరంగా ముగిశాయి. పీఠాధిపతి ఖుస్రూపాషా భక్తులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి ఉత్సవాలు ముగిసినట్లు ప్రకటించారు. అంతకుముందు దర్గా ప్రాంగణంలో హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఫకీర్ల బృందం ఇనుప సూదులను నాలుక, శరీరంపై గుచ్చుకుంటూ ఒళ్లు గగుర్పొడిచేలా విన్యాసాలు చేసిం ది. ముగింపులో జరిగిన ఖవ్వాలీ అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పీఠాధిపతి ఖుస్రూపాషా మాట్లాడుతూ.. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అల్లాను ప్రార్థించినట్లు తెలిపారు. ఉత్సవాలకు సౌకర్యాలు కల్పించిన కలెక్టర్‌, సీపీ, మున్సిపల్‌ కమిషనర్‌, జిల్లా అధికార యంత్రాంగానికి  కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉప పీఠాధిపతి భక్తియార్‌ బాబా, కార్పిరేటర్‌ అబూబక్కర్‌, అమర్‌ పాషా తదితరులు పాల్గొన్నారు.


logo