మంగళవారం 27 అక్టోబర్ 2020
Warangal-city - Oct 16, 2020 , 06:32:19

‘దేవాదుల’ పనులను వేగంగా పూర్తిచేయాలి

‘దేవాదుల’ పనులను వేగంగా పూర్తిచేయాలి

  • మిగిలిన భూసేకరణను త్వరగా ముగించాలి
  •  పూర్తికాని పనులకు టెండర్లు ఖరారు చేయాలి
  •  నాణ్యత విషయంలో రాజీపడొద్దు
  • రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు 

 వరంగల్‌ సబర్బన్‌: దేవాదుల ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారుల ను ఆదేశించారు. హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ప్రాజె క్టుకు సంబంధించిన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ పనుల్లో నాణ్యత విషయంలో రాజీపడొద్దన్నారు. ఆయా పనుల్లో మిగిలిన చోట భూ సేకరణ వెంటనే చేపట్టాలని, సమస్య ఉంటే సత్వ రమే పరిష్కరించాలని సూచించారు. పూర్తి కాని పనులకు వెంటనే టెండర్లు ఖ రారు చేయాలన్నారు. నిర్ణీత సమయానికి పనులు పూర్తయ్యేలా అధికారులు పర్యవే క్షించా లని మంత్రి ఆదేశించారు. ఈ నెల 19న నిర్వహించే సమావేశానికి అధికారులు ప్రాజె క్టు అభివృద్ధి పనులపై సమగ్ర నివేదికతో  రావాలన్నారు. దీనికి నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్‌కుమార్‌, సీఎం కార్యదర్శి, ఓఎస్డీ స్మితా సబర్వాల్‌, తదితర ఉన్నతాధికారులు హాజరవుతారన్నారు. ఈ సమీక్షలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌, ఎస్‌ఈ, సీఈలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.logo