గురువారం 22 అక్టోబర్ 2020
Warangal-city - Oct 15, 2020 , 03:01:45

ఎన్పీడీసీఎల్‌ పరిధిలో కంట్రోల్‌ రూం

ఎన్పీడీసీఎల్‌ పరిధిలో కంట్రోల్‌ రూం

వరంగల్‌ సబర్బన్‌, అక్టోబర్‌ 14 : భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్‌ సరాఫరాలో సమస్యలు, ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించేందుకు కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేసినట్లు ఎన్పీడీసీఎల్‌ సీఎండీ అన్నమనేని గోపాల్‌రావు తెలిపారు. ఎన్పీడీసీఎల్‌ పరిధిలోని అన్ని జిల్లాల సూపరింటెండెంట్లు, ఇంజినీర్లకు సీఎండీ పలు సూచనలు చేశారు. వర్షపు నీరు నిల్వ ఉన్న చోట విద్యుత్‌ స్తంభాలు, విద్యుత్‌ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు, సర్వీస్‌ వైర్లతో జాగ్రత్తగా ఉండాలన్నారు. వోల్టేజీలో హెచ్చుతగ్గులు గమనించినా, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద శబ్ధాలు వచ్చినా, భవనాలపై విద్యుత్‌ తీగలు పడినా వెంటనే ఫ్యూజ్‌ ఆఫ్‌ కాల్‌ కార్యాలయం లేదా కొత్తగా ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూం 9440811244, 9440811245, 1912 నంబర్లకు గాని 18004250028 టోల్‌ ఫ్రీ నంబర్‌కు గాని ఫిర్యాదు చేయాలన్నారు.logo