మంగళవారం 20 అక్టోబర్ 2020
Warangal-city - Oct 13, 2020 , 02:17:46

మహిళలు స్వశక్తితో ఎదగాలి

మహిళలు స్వశక్తితో ఎదగాలి

  • సాధికారత సాధించి ఆదర్శంగా నిలువాలి
  •  రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి 
  • ఎమ్మెల్యే పెద్దితో కలిసి చెన్నారావుపేటలో రైతు ఉపకరణాల అద్దె కేంద్రానికి ప్రారంభోత్సవం 
  •  రూరల్‌ కలెక్టరేట్‌లో ‘రూర్బన్‌ మిషన్‌'పై సమీక్ష
  •  యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యమని స్పష్టం
  • పర్వతగిరిని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతామన్న అమాత్యుడు

చెన్నారావుపేట, అక్టోబర్‌12: గ్రామీణ మహిళ లు స్వశక్తితో ఎదగాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. సోమవారం చెన్నారావుపేట మండల కేంద్రంలోని ఆశాజ్యోతి మండల సమాఖ్య కార్యాలయం ఆవరణలో జిల్లా గ్రామీణాభివృద్ధి, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెన్నారావుపేట-నెక్కొండ మండలాలకు సంబంధించిన రైతు ఉపకరణాల అద్దె కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భం గా అక్షయ రైతు ఉత్పత్తి దారుల సంఘానికి మంజూరైన రూ. 63.75 లక్షల విలువైన వ్యవసాయ యంత్ర పరికరాలను మహిళా సంఘాల బాధ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ మహిళలు సాధికారతను సా ధించి పలువురికి ఆదర్శంగా నిలువాలని అన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సహకారంతో చెన్నారావు పేట మండలంలో అక్షయ రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య ఆధ్వర్యంలో రైతు ఉపకరణాల అద్దె  కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. అలాగే ప్రతి గ్రామంలో మహిళా రైతు సంఘాలను ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గంలో ఇప్పటికే 110 రైతు ఉత్పత్తి సంఘాలు మార్కెట్‌లో వ్యవసాయాధారిత కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు. ఇందులో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచి ఆదర్శంగా ఉండాలన్నారు. కలెక్టర్‌ హరిత మాట్లాడుతూ ప్రభుత్వం పంపిణీ చేసిన వ్యవసాయ యంత్ర పరికరాలతో మహిళలు మరింత ఆర్థిక పరిపుష్టి సాధించాలని అన్నారు. 

రూ. 8 కోట్ల చెక్కు పంపిణీ

బ్యాంకు లింకేజీ రుణాల కింద మంజూరైన రూ. 8 కోట్ల చెక్కును మహి ళా సంఘాలకు మంత్రి ఎర్రబెల్లి పంపిణీ చేశా రు. మూడు సార్లు రాష్ట్రంలో స్వచ్ఛ అవార్డు, హరిత అవార్డులను అందుకున్నందుకు గాను ఎమ్మెల్యే పెద్దిని సన్మానించారు. అలాగే మహిళా సంఘాల సభ్యులను కూడా సత్కరించారు. కార్యక్రమంలో డీఆర్డీవో సంపత్‌ రావు, డీపీఎం శ్రీకాంత్‌, డీపీఎం అనిత, ఎంపీపీ బదావత్‌ విజేందర్‌, జడ్పీటీసీ బానోత్‌ పత్తినాయక్‌, వైస్‌ ఎంపీపీ కంది కృష్ణారెడ్డి, మండల కోఆప్షన్‌ సభ్యుడు ఎంఏ గప్ఫార్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బాల్నె వెంకన్న, చెన్నారావుపేట, అమీనాబాద్‌ సొసైటీ చైర్మన్లు ముద్దసాని సత్యనారాయణరెడ్డి, మురహరి రవి, నర్సంపేట ఏడీఏ తోట శ్రీనివాసరావు, తహసీల్దార్‌ పూల్‌సింగ్‌ చౌహాన్‌, ఎంపీడీ వో దయాకర్‌, ఎంపీవో సురేశ్‌, రైతు బంధు మండల కన్వీనర్‌ బుర్రి తిరుపతి, కొండవీటి ప్రదీప్‌కుమార్‌, అమ్మ రాజేశ్‌, కడా రి సాయిలు, సొసైటీ వైస్‌ చైర్మన్‌ చింతకింది వంశీ, ఏపీఎంలు ముక్కెర ఈశ్వర్‌, సుధాకర్‌, శ్రీనివాస్‌, అక్షయ మహిళా రైతు సంఘం అధ్యక్షురాలు సృజన, రాణిరుద్రమ జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రజిత, ఆశాజ్యోతి మండల సమాఖ్య అధ్యక్షురాలు భాగ్యమ్మ, తదితరులు పాల్గొన్నారు.logo