బుధవారం 28 అక్టోబర్ 2020
Warangal-city - Oct 12, 2020 , 06:25:56

వైజాగ్‌ టు వరంగల్‌

వైజాగ్‌ టు వరంగల్‌

  • రోడ్డు మార్గంలో గంజాయి  
  • పెట్రేగిపోతున్న స్మగ్లర్లు..  కార్లలో రవాణా
  • ప్యాకెట్ల రూపంలో సరఫరా
  • కిరాణా షాపులు, బేకరీలు,  టీకొట్లే అడ్డాలు
  • వరంగల్‌ మీదుగా మహారాష్ట్రకూ ట్రాన్స్‌పోర్ట్‌
  • సీఎం ఆదేశాలతో  గంజాయిపై పోలీసుల ఆరా

గంజాయి స్మగ్లర్లు పేట్రేగిపోతున్నారు. విశాఖపట్నం నుంచి వరంగల్‌కు గంజాయి ప్యాకెట్లను జోరుగా డంప్‌ చేసి ఇటు నుంచి మహారాష్ట్రకు, హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్నారు. నగరంలో విద్యాసంస్థలు, కార్మికులు ఎక్కువగా ఉండే చోట్లను ఆధారంగా చేసుకుని కిరాణా షాపులు, బేకరీలు, టీకొట్లను అడ్డాలుగా మార్చి దందా సాగిస్తున్నారు. గంజాయిపై ఉక్కుపాదం మోపాలని ఇటీవల సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో పోలీసులను ఆదేశించగా వారు రంగంలోకి దిగి ఉత్పత్తి, అమ్మకం, రవాణాపై ఆరా తీస్తున్నారు.               - వరంగల్‌ రూరల్‌, నమస్తే తెలంగాణ


సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో పోలీసులు రం గంలోకి దిగారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో గంజాయి సాగు, అమ్మకం, రవాణాదారుల వివరాలు సేకరిస్తున్నారు. గతంలో నమో దై న కేసులను పరిశీలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా నుంచి వరంగల్‌ మీదుగా ఇతర రాష్ర్టాలు, జిల్లాలకు ఎక్కువ గా గంజాయి రవాణా జరుగుతున్నట్లు గు ర్తించారు. ఈ మేరకు గంజాయి ఎక్కడి నుం చి వస్తుంది?, ఎక్కడికి వెళ్తుంది?, రవాణాదారులెవరు?, అమ్మకం అడ్డాలెక్కడ?, విక్రేతలె వరు?, వినియోగిస్తుందెవరు? తదితర అంశాలపై తమ నెట్‌వర్క్‌ ద్వారా కూపీ లా గుతున్నారు. వరంగల్‌ రూరల్‌, మహబూబాబాద్‌, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోని గ్రామాల్లో పలువురు మిశ్రమ పంటగా గం జాయి సాగు చేస్తున్నట్లు కనుగొన్నారు. ఏడా ది క్రితం కాళేశ్వరం పోలీసులు గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తులను పట్టుకుని విచారించగా భూపాలపల్లి మండలంలోని ఓ అట వీ గ్రామంలో కొందరు సాగు చేసినట్లు తేలిం ది. కొద్ది నెలల క్రితం రూరల్‌ జిల్లా నర్సంపే ట ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామంలో గంజాయి మొక్కలను గుర్తించి పోలీసులు ధ్వంసం చేశారు. మహబూబాబాద్‌ జిల్లాలో నూ ఇలాంటి ఘటనలు వెలుగుచూశాయి. పలు గ్రామాల్లో మిశ్రమ పంటగా కొంత గం జాయి సాగు జరుగుతున్నట్లు వివిధ ప్రభు త్వ శాఖల అధికారులు భావిస్తున్నారు.

గంజాయి రవాణా జోరు..

గంజాయి సాగు తగ్గినా వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో రవాణా పెరిగింది. ప్రధానంగా విశాఖపట్నం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి స్మగ్లర్లు ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్నా రు. మార్గమధ్యంలో వరంగల్‌ నగరంలో నూ కొంత డంప్‌ చేసి హైదరాబాద్‌కూ రవా ణా చేస్తున్నారు. ఇందుకోసం కార్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తనిఖీల్లో పోలీసులు గుర్తించకుండా గంజాయిని రెండు కిలోల ప్యాకెట్లు చేసి ట్రాన్స్‌పోర్టు చేస్తున్నారు. గతేడాది ఆగస్టులో వర్ధన్నపేట మండలం కొత్తపల్లి సమీపంలో పోలీసులు ఓ కారును ఆపి తనిఖీ చేసి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నా రు. ఇక్కడ లభించిన ఆధారాలతో ఇదే మం డలంలోని ఓ తండాలోనూ కొన్ని గంజాయి ప్యాకెట్లను పట్టుకున్నారు. వీరిని విచారించ గా పట్టుబడిన కారు మహారాష్ట్రకు వెళ్తున్న ట్లు, రవాణాదారు విశాఖపట్నంలో స్థిరపడిన రాయపర్తి మండలానికి చెందిన వ్యక్తిగా తే లింది. ఆ తర్వాత కొద్ది నెలలకు గీసుగొండ మండలం కీర్తినగర్‌ కాలనీలో పోలీసులు గం జాయి నిల్వలు, రెండు కార్లను పట్టుకున్నా రు. అందులో తుపాకీ సైతం లభించడం అ ప్పట్లో సంచలనం కలిగించింది. ఈ సరుకు కూడా స్థానికులు కొందరు విశాఖ జిల్లా నుం చి గంజాయిని వివిధ రాష్ర్టాలు, జిల్లాలకు ర వాణా చేస్తున్న క్రమంలో పట్టుబడిందని పో లీసుల విచారణలో గుర్తించారు. కొద్ది రోజులకే నర్సంపేటలో మరో కారు పట్టుబడింది. 

మార్గమధ్యలో అమ్మకం..

వర్ధన్నపేట, కీర్తినగర్‌ కాలనీ, నర్సంపేట లో పట్టుబడిన గంజాయి నిల్వల్లో కొంత వ రంగల్‌ నగరంలోని అమ్మకందారుల అడ్డా ల్లో డంప్‌ చేస్తున్నారని, విద్యాసంస్థలు, పారిశ్రామిక వాడలు, లేబరు అధికంగా నివసిస్తున్న ప్రాంతాలను అడ్డాలుగా చేసుకుని కొందరు గంజాయి విక్రయిస్తున్నట్లు అప్ప ట్లో పోలీసుల దృష్టికి వచ్చింది. గంజాయి అ మ్మకం జరిగే కిరాణా షాపులు, బేకరీలు, టీ కొట్లు, కేఫ్‌లు, విక్రేతల సమాచారాన్ని కూ డా కొంతవరకు సేకరించారు. వివిధ ప్రాం తాల్లో గంజాయితో పట్టుబడిన వ్యక్తుల్లో వ రంగల్‌ ఉమ్మడి జిల్లావాసులూ ఉండడం గ మనార్హం. ఈ నెల ఒకటిన నెక్కొండ మండ ల కేంద్రంలో పోలీసులు ఓ కారులో ఏడు కి లోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం జిల్లా సీలేరు నుంచి జగిత్యాల జిల్లాకు గంజాయితో వెళ్తున్న ఈ కారు వాహ న తనిఖీల్లో పట్టుబడినట్లు ప్రకటించారు. జగిత్యాల జిల్లాకు చెందిన జైకిషన్‌ సహా నలుగురిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. తాజాగా వరంగల్‌ సీపీ ప్రమోద్‌కుమార్‌ పోలీసు అధికారులతో స మావేశమై గంజాయి ఉత్పత్తి, అమ్మకం, ర వాణా అరికట్టాలని ఆదేశించారు.


logo