మంగళవారం 27 అక్టోబర్ 2020
Warangal-city - Oct 11, 2020 , 07:10:31

ఎన్యుమరేటర్లకు సహకరించాలి : కలెక్టర్‌

ఎన్యుమరేటర్లకు సహకరించాలి : కలెక్టర్‌

నయీంనగర్‌ : నగరంలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు కోసం ఇంటింటికీ వస్తున్న ఎన్యుమరేటర్లకు ప్రజలు సహకరించాలని, లేనిపక్షంలో భవిష్యత్‌లో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీహన్మంతు అన్నారు. వడ్డేపల్లి టీచర్స్‌ కాలనీలో శనివారం ఆయన ఆస్తుల నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ఎన్యుమరేటర్లకు యజమానితో పాటు వారి కుటుంబ సభ్యులు తప్పనిసరిగా వివరాలు చెప్పాలని సూచించారు. భవిష్యత్‌లో ఆ ఆస్తులకు మీ వారసులు హక్కుదారుగా ఉంటారని, ఇతరులు ఎవరు కుడా ఇది తమ ఆస్తి అని చెప్పడానికి వీలుండదని పేర్కొన్నారు. నగరంలో 2.12 లక్షల గృహాల నమోదు ప్రక్రియ అక్టోబర్‌ 15 వరకు పూర్తి చేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఆస్తుల విషయంలో ఎలాంటి తగాదాలు ఉండకూడదనే ఉద్దేశంతో నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్యుమరేటర్లు ఇంటికి వస్తే ఎవరూ లేరని సమాధానం ఇవ్వకూడదని అన్నారు. కలెక్టర్‌ వెంట సర్కిల్‌ పర్యవేక్షకుడు ఎల్కతుర్తి తహసీల్దార్‌ రవీందర్‌రెడ్డి ఉన్నారు. 

 ‘ఆడపిల్లను రక్షిద్దాం’ పోస్టర్‌ ఆవిష్కరణ

హన్మకొండ : అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని రూపొందించిన ఆడపిల్లను రక్షిద్దాం అనే పోస్టర్‌ను కలెక్టర్‌ రాజీవ్‌గాంధీహన్మతు శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ కే లలితాదేవి, తానా అధ్యక్షుడు డాక్టర్‌ రాకేశ్‌, ఐఎంఏ నుంచి డాక్టర్‌ రమేశ్‌, డాక్టర్‌ రాకేశ్‌రెడ్డి, డీఈఎంవో వీ అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

దసరాకు రైతు వేదికలు పూర్తిచేయాలి 

మిల్స్‌కాలనీ : దసరా పండుగ వరకు రైతు వేదికల నిర్మాణాలను పూర్తిచేయాలని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీహన్మంతు ఆదేశించారు. గ్రేటర్‌ నాలుగో డివిజన్‌ పరిధిలోని స్తంభంపల్లి, ఐదో డివిజన్‌లోని బొల్లికుంటలో రైతు వేదికల నిర్మాణాలను శనివారం ఆయన పరిశీలించారు. కలెక్టర్‌ వెంట నాలుగు, ఐదు డివిజన్ల కార్పొరేటర్లు బిల్లా కవిత, పసునూరి స్వర్ణలత, ఖిలావరంగల్‌ పీఏసీఎస్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ సోల్తి భూమాత, టీఆర్‌ఎస్‌ నాయకులు బిల్లా శ్రీకాంత్‌, పసునూరి వజ్రయ్య, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు తరగల ప్రసాద్‌, రవీందర్‌ రెడ్డి, పరశురాములు, సోల్తి నరేందర్‌, చీకటి సరిత తదితరులు ఉన్నారు.logo