గురువారం 22 అక్టోబర్ 2020
Warangal-city - Oct 10, 2020 , 06:42:20

పీవీ చరిత్రను ప్రపంచవ్యాప్తం చేయాలి

పీవీ చరిత్రను ప్రపంచవ్యాప్తం చేయాలి

  • సమీక్షలో కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు

హన్మకొండ, అక్టోబర్‌ 9 : మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు చరిత్రను భావితరాలకు అందించేందుకు ఓరుగల్లు సాహితీ వేత్తలు కృషి చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో సహితీవేత్తలు, సావనీర్‌ కమిటీ సభ్యులతో ఆయన మాట్లాడారు. బాల్యం నుంచి ప్రధానిగా ఎదిగిన తీరును సావనీర్‌లో రూపొందించాలని కలెక్టర్‌ కోరా రు. సాధారణ పాఠకుడికి అర్థమయ్యేలా సాహితీవేత్తలు రచనలు చేయాలన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు సావనీర్‌ రూపకల్పనపై పలు సూచనలు చేశారు. కాళోజీ పురస్కా ర గ్రహీత రామా చంద్రమౌళిని కలెక్టర్‌ సన్మానించారు. సమావేశంలో కమిటీ కన్వీనర్‌, సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఎండీ ముర్తుజా, సభ్యులు పీవీ నిరంజన్‌రావు, గిరిజా మనోహర్‌, డాక్టర్‌ టీ శ్రీరంగస్వామి, పొట్లపల్లి శ్రీనివాసరావు, యెడబాటి వామన్‌రావు, పీవీ మదన్‌మోహన్‌, డాక్టర్‌ ఎస్‌ వీ ఎస్‌ చారి, ఎండీ సిరాజొద్దీన్‌, టీ నరేందర్‌, బూర విద్యాసాగర్‌ పాల్గొన్నారు. 

లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలి

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న సమయంలో పండుగలు, ఉత్సవాలు లాక్‌డౌన్‌ 5.0 నిబంధనల ప్రకారం జరుపుకోవాలని కలెక్టర్‌ అన్నారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్‌, తూర్పు ఎమ్మె ల్యే నన్నపునేని నరేందర్‌, కమిషనర్‌ పమేలా సత్పతి, ఉత్సవ కమిటీల సభ్యులు, పూజరులతో దసరా, బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. బతుకమ్మను ఇంటి వద్దే ఆడుకోవాలన్నారు. దసరా ఉత్సవాలపై పోలీస్‌ శాఖతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. వినయ్‌ భాస్కర్‌, ఎమ్మెల్యే నరేందర్‌ మాట్లాడుతూ.. బతుకమ్మ, కాజీపేట దర్గా ఉత్సవాలు పరిమితికి లోబడి నిర్వహించుకోవాలన్నారు. ఎంపీ డాక్టర్‌ బండా ప్రకాశ్‌ మాట్లాడుతూ.. కరోనా నివారణకు కేరళ తీసుకున్న చర్యలు అభినందనీయమన్నారు. ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించాలని తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ అన్నారు. భద్రకాళి ఆలయ పూజారి శేషు మాట్లాడుతూ ..బతుకమ్మ 17 నుంచి, 24న సద్దుల బతుకమ్మ, 25న దసరా పండుగ ఉంటుందన్నారు.   

దసరాలోపు  రైతు వేదికలు పూర్తి చేయాలి

రైతు వేదికల నిర్మాణ పనులను దసరా లోపు పూర్తి చేయించాలని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు పంచాయతీరాజ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో పీఆర్‌ ఇంజినీర్లతో మండలాల వారీగా రైతు వేదిక నిర్మాణ పనుల ప్రగతిపై సమీక్షించారు. సమావేశంలో పంచాయతీ రాజ్‌ ఈఈ, డిఫ్యూటీ ఈఈ, ఏఈలు పాల్గొన్నారు.logo