శనివారం 24 అక్టోబర్ 2020
Warangal-city - Oct 10, 2020 , 06:35:26

సీఎం కేసీఆర్‌ మనసున్న మారాజు

సీఎం కేసీఆర్‌ మనసున్న మారాజు

  • ఉద్యోగుల సమస్యలకు త్వరలో పరిష్కారం
  • తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీవోల పాత్ర మరువలేనిది
  • కారం రవీందర్‌రెడ్డి అభినందన సభలో చీప్‌విఫ్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌
హన్మకొండ, అక్టోబర్‌ 9 : సీఎం కేసీఆర్‌ మనసున్న మారాజు అని, ఉద్యోగుల సమస్యలకు త్వరలోనే పరిష్కారం చూపుతారని ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. శుక్రవారం సాయంత్రం హన్మకొండలోని అంబేద్కర్‌భవన్‌ లో టీఎన్‌జీవోస్‌ వరంగల్‌ ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్‌ కోలా రాజేశ్‌కుమార్‌గౌడ్‌ అధ్యక్షతన వరంగల్‌ అర్బన్‌ జిల్లా స్టాండింగ్‌ కమిటీ సమావేశం, టీఎన్‌జీవోస్‌ కేంద్ర సంఘం మాజీ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి పదవీ విరమణ అభినందన సభ జరిగింది. చీఫ్‌విప్‌ దాస్యం, వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ ముఖ్య అతిథులు గా హాజరయ్యారు. ఈ సందర్భంగా దాస్యం మా ట్లాడుతూ.. టీఎన్‌జీవోస్‌ యూనియన్‌తో తమ కు టుంబానికి ఎనలేని అనుబంధం ఉందన్నారు. తె లంగాణ ఉద్యమంలో టీఎన్‌జీవోలు కీలకంగా వ్యవహరించారని, వారి పాత్ర మరువలేనిదన్నారు. ఉద్యోగుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.  పదవీ విరమణ పొందిన కారం రవీందర్‌రెడ్డి సీఎం దృష్టిలో ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి తప్పకుండా రవీందర్‌రెడ్డికి సముచిత స్థానం కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.  ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ అ న్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, టీఎన్‌జీవోస్‌  అను బంధం తల్లీబిడ్డల వంటిదని,  ఎవరూ విడదీయలేరన్నారు.  కారం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్లానన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వరంగల్‌ ఉద్యోగులతో జిల్లాకు మంచి గుర్తింపు వచ్చిందన్నారు. ఉ ద్యమ సమయంలో టీఎన్‌జీవోస్‌ వేసిన టెంట్‌ వద్దకు వినయ్‌భాస్కర్‌ ప్రతి నిత్యం వచ్చి  అండ గా నిలిచారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు.  ఉద్యోగుల శ్రేయస్సు కోసమే గత 70 సం వత్సరాలుగా టీఎన్‌జీవోస్‌ సంఘం పనిచేస్తున్నద ని కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌ అన్నారు.  టీఎన్‌జీవో పోరాటంతోనే ప్రభుత్వం 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చిందన్నారు. పీఆర్‌సీ ని వేదికలు ఇవ్వని కమిషన్‌ వెంటనే రాజీనామా చే యాలన్నారు. ఉద్యోగ జేఏసీ చైర్మన్‌ పరిటాల సు బ్బారావు మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సంపూర్ణ అవగాహన ఉందని, తప్పకుండా సమస్యలను పరిష్కరిస్తారన్నారు.  సీఎం కారం రవీందర్‌రెడ్డికి సముచిత స్థానం కల్పిస్తారని ఆశిస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ స్థానం కేటాయిస్తే గెలిపించి ముఖ్యమంత్రికి అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పోరాటాల పురిటిగడ్డ వరంగల్‌ అని ఉమ్మడి జిల్లా టీజీవో కో ఆర్డినేటర్‌ ఏ జగన్మోహన్‌రావు అన్నారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా అందులో వరంగల్‌ ఉద్యోగులు ముందు వరుసలో ఉంటారన్నారు. 
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ఎమ్మెల్యే నన్నపునేని న రేందర్‌, పదవీ విరమణ పొందిన కారం రవీందర్‌రెడ్డి, టీఎన్‌జీవోస్‌ కేంద్ర సంఘం నూతన అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌, ప్రధాన కార్యదర్శి ప్ర తాప్‌ను ఉద్యోగ సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. అంతకు ముందు కారం రవీందర్‌రెడ్డి, ఉద్యోగ సంఘాల నాయకుల సమక్షంలో పట్టభద్రుల ఓటరు నమోదు దరఖాస్తును హన్మకొండ తహసీల్దార్‌ కిరణ్‌ప్రకాశ్‌కు అందించారు. కార్యక్రమాల్లో టీఎన్‌జీవోస్‌ కేంద్ర సంఘం ప్రధా న కార్యదర్శి రాయకంటి ప్రతాప్‌, ఎంజీఎం సూ పరింటెండెంట్‌ నాగార్జునరెడ్డి, డీఎంహెచ్‌వో డాక్ట ర్‌ కే లలితాదేవి, డీఆర్వో వాసుచంద్ర, ట్రెస్సా ఉ మ్మడి జిల్లా కో ఆర్డినేటర్‌ జీ రాజ్‌కుమార్‌, ఉద్యోగ సంఘాల నాయకులు రామినేని శ్రీనివాసరావు, కస్తూరి వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్‌, పుల్లూరి వేణుగోపాల్‌, ఆకుల రాజేందర్‌, రత్నాకర్‌రెడ్డి, రత్నవీరాచారి, రియాజొద్దీన్‌, బైరి సోమయ్య, అంజద్‌అలీ, రాంకిషన్‌, శ్యాంసుందర్‌, రామునాయక్‌, మురళీధర్‌రెడ్డి, షఫీ, శ్రీనివాస్‌, బూరుగు రవికిరణ్‌రెడ్డి, టీటీయూ ప్రధాన కార్యదర్శి నర్సింహస్వామి, పెన్షనర్ల సంఘం ఫౌండర్‌ దామోదర్‌, వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 


logo