శనివారం 31 అక్టోబర్ 2020
Warangal-city - Oct 09, 2020 , 06:20:45

యాసంగి యాక్షన్‌ ప్లాన్‌ రెడీ

యాసంగి యాక్షన్‌ ప్లాన్‌ రెడీ

  • సాధారణం కంటే సాగు రెట్టింపు 
  • భారీగా పెరుగనున్న వరి
  • మక్కవైపు దండిగానే రైతుల మొగ్గు 
  • తగ్గి పోతున్న పప్పుదినుసుల పంటలు
  • ఎరువులకు ప్రత్యేకంగా ఇండెంట్లు

వరంగల్‌ సబర్బన్‌, అక్టోబర్‌8: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు తోడు వరుణుడు కరుణించడంతో సాగువిస్తీర్ణం పెరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యవసాయాధికారులు యాసంగి పంటల సాగుకు సంబంధించిన ప్రణాళికలను ముందస్తుగానే తయారు చేశారు. జిల్లాలో రైతులు పం డించ బోయే పంటలు, కావాల్సిన ఎరువులు తదితర అంశాలపై యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేయాలని వ్యవసాయ శాఖ ముఖ్యకార్మదర్శి జనార్దన్‌రెడ్డి వారం రోజుల క్రితం ఆదేశించారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన అధికారులు మండలాల వారీగా రైతులు సాగు చేయనున్న పంటల వివరాలు సేకరించారు. దీనిని బట్టి గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం రెట్టింపయినట్లు అధికారులు గుర్తించారు. ప్రధానంగా వరి, మొక్కజొన్న, వేరుశనగా పంటల సాగుపై ఆసక్తి చూపుతున్నట్లు వారు చెబుతున్నారు. 

యాసంగిలో డబుల్‌

జిల్లాలో యాసంగి సాధారణ సాగు విస్తీర్ణం 64,184 ఎకరాలు. కానీ, ఇటీవల కురిసిన వర్షాలు, తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా నీరు చెరువుల్లోకి చేరడంతో భూగర్భ జలాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో యాసంగిలోనూ సాగు నీటికి ఇబ్బంది లేదు. దీంతో సాగు రెట్టింపు కానున్నదని అధికారులు అంచనా వేశారు. గత ఏడాది యాసంగిలో లక్షా 18 వేల 495 ఎకరాల్లో వివిధ పంటలు సాగవగా, ఈ ఏడాది లక్షా 37 వేల 19 ఎకరాల్లో సాగు చేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. వరి సాధారణ సాగు విస్తీర్ణం 31,604 ఎకరాలు, గతేడాది 74,092 ఎకరాల్లో సాగు చేయగా ప్రస్తుతం 80, 253 ఎకరాల్లో సాగు చేయనున్నారు. అదేవిధంగా మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 26,714 ఎకరాలు. గతేడాది 41, 547 ఎకరాల్లో సాగవగా, ఈ ఏడాది 53, 326 ఎకరాల్లో సాగయ్యే అవకాశముందని అధికారులు గుర్తించారు. మూడేళ్ల క్రితం 18 వేల ఎకరాల్లో మాత్రమే సాగైన మొక్కజొన్న ఇప్పుడు 53 వేల ఎకరాలకు పెరిగింది. పల్లికాయ సాధారణ సాగు విస్తీర్ణం 1,465 ఎకరాలు. కానీ, ఈ ఏడాది 1,889 ఎకరాల్లో సాగు చేయనున్నారు. ఇదిలా ఉండగా పప్పుదినుసుల పంటల సాగుకు రైతులు విముఖత చూపుతున్నట్లు అధికారుల సర్వేలో తేలింది. 752 ఎకరాల్లో శనగలు, 311 ఎకరాల్లో పెసర్లు, 151 ఎకరాల్లో మినుము లు సాగు చేయనున్నట్లు గుర్తించారు. పొద్దుతిరుగుడు, పొగా కు పంటలను జిల్లా రైతులు పూర్తిగా మరిచి పోయినట్లు అధికారులు పేర్కొన్నారు.

బఫర్‌ నిల్వలుగా ఎరువులు

ఎరువుల సరఫరాలో కేంద్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ యాసంగికి అవసరమైన ఎరువుల విషయంలోనూ అంచనాలు రూపొందించింది. రెండు రోజులుగా జిల్లాకు ఎరువులు దిగుమతి అవుతుండడంతో వాటిని గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. ప్రస్తు తం 328 మెట్రిక్‌ టన్నుల డీఏపీ, 1987 మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌, 1666 మెట్రిక్‌ టన్నుల యూరియా నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. కానీ, యాసంగి పంటలకు 24 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా, 6, 500 మెట్రిక్‌ టన్నుల డీఏపీ, 8,100 మెట్రిక్‌ టన్నుల కాంప్ల్లెక్స్‌, 6,900 మెట్రిక్‌ టన్నుల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ (ఎంవోపీ) అవసరమవుతాయని వ్యవసాయ శాఖ కమిషనర్‌కు పంపిన లేఖలో పేర్కొన్నారు. 

ఇబ్బంది లేకుండా చూస్తాం 

యాసంగి పంటల సాగు విస్తీర్ణానికి సంబంధించి ప్రణాళికలు తయారు చేశాం. ఈ సారి సాగు విస్తీ ర్ణం పెరుగనున్నది. వరి, మొక్కజొ న్న సాగు చేసేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. రైతులకు కావాల్సి న ఎరువులు, విత్తనాలు మార్కెట్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటా.

-ఉషా దయాళ్‌, జిల్లా వ్యవసాయాధికారి